ప్రతిరోజు సోషల్ మీడియా( Social media)లో అనేక రకాల వైరల్ వీడియోలను మనం చూస్తూనే ఉంటాం.ఇందులో చాలావరకు ఫన్నీ వీడియోలు ఉండగా.
మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా మారుతుంటాయి.మరికొన్ని వీడియోలు భయాన్ని కలిగించేలా కూడా ఉంటాయి.
తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో గురించి చూస్తే.
అమెరికాలోని ఫ్లోరిడా( Florida ) రాష్ట్రంలో రోడ్డుపై వెళ్తున్న వాహనంపై పిడుగు పడినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది.ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంప ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.కేవలం 34 సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్ చూస్తే ఖచ్చితంగా భయభ్రాంతులకు లోనవ్వడం గ్యారెంటీ.
ఒక కుటుంబం వారి వాహనం లో రోడ్డుపై వెళ్తుండగా సడన్ గా వాతావరణంలో మార్పులు వచ్చి ఉన్నటువంటి పెద్ద మెరుపుతో పిడుగుపాటు జరిగింది.ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంప ప్రాంతంలో వాహనంపై మెరుపు పడడం ఈ వీడియోలో కనపడుతుంది.అంతేకాకుండా ఇతర వాహనాలు కూడా ఈ సంఘటనకు సంబంధించి వీడియో రికార్డ్ అయ్యాయి.
సదరు పిడుగు( Lightning )పాటుకు గురైన కారులో కూడా కెమెరా ఉండడంతో ఈ అద్భుత దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి.ఇకపోతే అదృష్టం కొద్దీ కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమి కాకపోవడం నిజంగా అదృష్టం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.వామ్మో.ఇంత పెద్ద పిడుగు అంటూ కొందరు అంటుండగా., నిజంగా మీరు అదృష్టవంతులు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.