తెలుగు సినిమా పరిశ్రమ సత్తాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుల్లో ప్రముఖ వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్.
ఎన్నో కళాఖండాలను అందించిన మహా దర్శకుడు ఆయన.చేతిలో ప్రాణం పోసుకున్న సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎన్నో అద్భుత కళారూపాలకు విశ్వనాథ్ కేరాఫ్ అడ్రస్ గా మారారు.ఆయన సినిమాలన్నీ సమాజానికి గొప్ప సందేశాలు ఇచ్చిన చిత్రాలే.సినిమాలు అనగానే హీరోయిజాన్ని ఎలుగెత్తి చాటుతారు చాలా మంది దర్శకులు.విశ్వనాథ్ మాత్రం చుట్టూ ఉండే మనుషులనే హీరోలుగా తీర్చిదిద్దుతాడు.
అంతేకాదు.హీరోపాత్రకు ఏమాత్రం తీసిపోకుండా హీరోయిన్ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తాడు.
ఆయన సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అయ్యారు.ఆయనతో చేసిన తొలి సినిమాలతోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.ఇంతకీ ఆయన తీర్చిదిద్దిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
తులసి- శంకరాభరణం
భారతీయ సినీ పరిశ్రమలో అద్భుత చిత్రం శంకరాభరణం.ఈ సినిమాలో హీరోయిన్ గా పేరున్న వారిని కాకుండా ఎవరికీ తెలియని మంజు భార్గవిని తీసుకున్నాడు.ఈ సినిమాలో ఆమె తులసి క్యారెక్టర్ చేసింది.
మాటలకన్నా.కళ్లతో పలికించిన భావాలే అద్భుతం అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమా తర్వాత మంజు భార్గవి ఎక్కువ సినిమాలు చేయలేదట.ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ కంటే గొప్ప క్యారెక్టర్ మరొకటి ఉండదని తను భావించిందట.కానీ కొంత కాలం తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించింది.
మాధవి- సాగరసంగమం
ఈ సినిమాలో మాధవి క్యారెక్టర్ జయప్రద చేసింది.ఈమె పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు విశ్వనాథ్.హీరో బాలు క్యారెక్టర్ కు తోడుగా ఉండి ఆయన కెరీర్ కు సపోర్టు చేసే మంచి స్నేహితురాలి పాత్ర ఆమెది.
అంతే కాదు ఈ సినిమాలో ఆమె నటన తీరును వర్ణించలేం.అంతగొప్పగా నటించింది.
లలిత- స్వాతిముత్యం
ఈ సినిమాలో హీరోయిన్ లలిత విధవగా కనిపిస్తుంది.నుదుటిన బొట్టు లేకుండా, సాధారణ వస్త్రాలు ధరించి ఉంటుంది.ఈ పాత్రలో నటించిన రాధిక ఓ రేంజిలో నటనా శక్తిని ప్రదర్శించింది.లలిత లాంటి గొప్ప రోల్ రాధిక కెరీర్ లో మళ్లీ దొరకలేదని చెప్పుకోవచ్చు.
గంగ- స్వయంక్రుషి
ఈ సినిమాలో డబ్బులో పేద.గుణంలో గొప్ప అమ్మాయి గంగ.ఈ క్యారెక్టర్ ను విజయశాంతి పోషించి అద్భుతంగా నటించింది.సినిమా మొదలు నుంచి ఆది వరకు గంగ పాత్రలో జీవించింది ఈ లేడీ సూపర్ స్టార్.
హేమ- సప్తపది
ఈ సినిమాలో హేమ అనే క్యారెక్టర్ ను సబిత చేసింది.మన ఆచారాలు, కట్టుబాట్లు, మూడ నమ్మకాలపై విశ్వనాథ్ చేసిన విఫ్లవం ఈ సినిమా.మూడ నమ్మకాలను ఎదిరించే హేమ పాత్రలో సబిత జీవించారు.జనాలను ఆకట్టుకున్నారు.
మీనాక్షి- స్వర్ణ కమలం
ఈ సినిమాలో మీనాక్షి పాత్రను భాను ప్రియ చేసింది.లేనిపోని ఆశలకు పోయి ఏది నిజం.ఏది అబద్దం అని తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది మీనాక్షి.నిజమైన ఆనందం అంటే ఏంటో చెప్పి రియలైజ్ అవడంతో ఈ సినిమా ముగుస్తుంది.
సుభాషిని- సిరివెన్నెల
విశ్వనాథ్ రూపొందించిన మరో అద్భుత క్యారెక్టర్ సిరివెన్నల సినిమాలో సుభాషిని.ఇందులో మూగ అమ్మాయిగా సుభాషిని రోల్ సుహాసిని చేసి మెప్పించింది.ఈ సినిమాలో ప్రతి సీన్ జనాలతో కనెక్ట్ అవుతుంది.
సుజాత- శుభలేఖ
వరకట్నం అనే కథాశంతో తెరకెక్కింది ఈ సినిమా.కట్నం మూలంగా అమ్మాయి కుటుంబం అనుభవించే బాధలను ఈ సినిమాలో చూపించాడు విశ్వనాథ్.పేదింటి అమ్మాయి సుజాత పాత్రలో సుమలత అద్భుతంగా నటించింది.
హేమ- అపద్భాందవుడు
ఈ సినిమాలో తెలుగమ్మాయి హేమగా మీనాక్షి శేషాద్రి చేసిన క్యారెక్టర్ సింపుల్ గా అద్భుతంగా ఉంటుంది.అందం, అణకువ, అమాయకత్వం కలిపిన అమ్మాయిగా అద్భుత నటన కనబరుస్తుంది.చక్కటి నటనతో జనాలకు దగ్గరయ్యింది మీనాక్షి.
గంగ- శుభసంకల్పం
ఈ సినిమాలో గంగపాత్ర చేసింది ఆమని.తొలిసారి తెరపై కనిపించాడు విశ్వనాథ్.గంగ పాత్రను ఇందులో అద్భుతంగా రూపొందించాడు దర్శకుడు.పెద్దల మీద గౌరవం.ఇష్టమైన వాడిమీద ప్రేమతో తను చనిపోయే సీన్ ల ఆమని నటన కన్నీళ్లు పెట్టిస్తుంది.