సాయి రాజేష్ ( Sai Rajesh ) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda ) వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ( Baby ).ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇలా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైష్ణవి చైతన్య ఈ సినిమా గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
తాను ఇప్పటివరకు యూట్యూబర్ గామంచి గుర్తింపు సంపాదించుకున్నాను అయితే సినిమాలలో నటించాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చానని సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇక జీవితాంతం తాను యూట్యూబర్ గానే స్థిరపడిపోతానన్న సందేహం తనలో ఉండేదని తెలిపారు.
ఇక సాయి రాజేష్ నాకు ఈ సినిమా కథ చెప్పి నేను నటించగలనన్న ధైర్యం నాలో నింపారని వైష్ణవి చైతన్య( Vaishanvi Chaitanya ) వెల్లడించారు.ఈ సినిమాలో తాను ఒకబస్తీలో ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తెలిపారు.వ్యక్తిగతంగా తాను ఒక బస్తీ అమ్మాయినేనని ఈ సినిమా కథ వింటున్నప్పుడు నా కథ నాకు గుర్తొచ్చిందని తెలిపారు.
ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిపారు.ఇక ఈ సినిమాకు బేబీ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న విషయం కూడా ఓ సన్నివేశంలో క్లారిటీగా అర్థమవుతుందని ఈమె తెలియజేశారు.
ఇకపోతే ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్స్( Heroines ) అందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హీరోయిన్స్ అనే విషయం మనకు తెలిసింది.అయితే తెలుగులో కూడా చాలామంది హీరోయిన్స్ ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు.అయితే వారికి అవకాశాలు రాకపోవడానికి మరే కారణం లేదని వైష్ణవి చైతన్య వెల్లడించారు.కథానాయకులుగా తెలుగు వారికి అవకాశాలు( Telugu Heroines ) ఇవ్వరు అన్న ప్రచారం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ ప్రచారం కారణంగానే చాలామంది తెలుగువారు సినిమాలకు దూరంగా ఉంటున్నారని,ప్రయత్నిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి అంటూ ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.