ఉచిత కరెంట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.మరోవైపు రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయి.