తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ లోకి అంతే స్థాయిలో చేరికలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధానంగా పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం అయింది.
ఈ సమయంలో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అందిస్తామని, వీలైనన్ని ఎక్కువ పథకాలను అమలు చేస్తామని చెప్పాల్సిన సమయంలో ఉన్న పథకాలకి కోత పెడతామనే విధంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.
అసలు 24 గంటలు విద్యుత్ అవసరం లేదన్నట్లుగా రేవంత్( Revanth reddy ) మాట్లాడారు.దీనిపై తీరంగా చర్చ జరగడంతో పాటు, ప్రజల్లోనూ రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం కనిపిస్తోంది.
రేవంత్ కామెంట్స్ ను అవకాశం తీసుకుని బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ,కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి చర్యలకు దిగింది.ఇక సొంత పార్టీలోనూ రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ కు లేనిపోని తలనొప్పులు తెచ్చే విధంగా రేవంత్ బాధ్యతారాహిత్యం మాట్లాడారని, ఈ వ్యాఖ్యల ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ కు చేటు తెస్తుందనే భయాన్ని కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీసి ఇప్పించాల్సిన బాధ్యత ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉండి, 24 గంటల విద్యుత్ అవసరం లేదని వ్యాఖ్యానించడం పై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆగ్రహంగా ఉందట.ఇటీవల అమెరికాకు వెళ్లిన రేవంత్ అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడ ఉచిత విద్యుత్ పై మాట్లాడటంతో పాటు, అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామంటూ మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ), పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు.రేవంత్ అమెరికా వెళ్లేంతవరకు బాగానే ఉన్నాడు.అక్కడకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ, ఎర్రబెల్లి ప్రభావం పడి అలా మాట్లాడుతున్నాడేమో అంటూ వెంకటరెడ్డి సెటైర్లు వేశారు.
రేవంత్ పప్పులో కాలు వేస్తున్నాడేమో అనిపిస్తోంది.ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యాదృచ్ఛికంగా ఒక్క పదం అన్నందుకు తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.వ్యవసాయం దండగ అన్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.
రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వెళుతున్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు ఏడు, తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చాం.అసలు ఉచిత విద్యుత్ గురించి ఎందుకు మాట్లాడాలి ? 24 గంటలు కరెంట్ ఇవ్వడంలేదని బీఆర్ఎస్ ను విమర్శించాలి కానీ, ఇస్తామంటే వద్దనడం ఎందుకు ? దీంతో పాటు కాంగ్రెస్సే రేవంత్, రేవంతే కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు.సీతక్కను సీఎం చేస్తామన్నారు.
పిసిసి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్ని పదవులు తెలుగుదేశం పార్టీ( TDP ) నుంచి వచ్చిన వారికేనా ? అసలైన కాంగ్రెస్ వాదులకు ఏం పదవులు లేవా ? ఈ విషయంపై రాహుల్ గాంధీతోనే మాట్లాడుతామని వారు వ్యాఖ్యానించారు.మిగతా సీనియర్లు తమదైన శైలిలో రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తుండడంతో కాంగ్రెస్ కు డ్యామేజ్ మరింతగా జరుగుతోంది.