దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు నెలకొంది.ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యమునా నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది.
దీంతో ఢిల్లీకి గండం పొంచి ఉంది.యమునా నదీ నీటి మట్టం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో ప్రస్తుతం 207.25 మీటర్లకు నీటిమట్టం చేరింది.పది సంవత్సరాల తరువాత యమునా నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది.2013 లో 207.32 మీటర్ల వరకు వరద ప్రవాహం కొనసాగింది.ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హర్యానా హతినికుండ్ బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో యమునా నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఐటీఓ, మయూర్ విహార్, లక్ష్మీనగర్, యమునా బజార్ లో నదీ పరివాహాక ప్రజలు రోడ్లపైకి చేరారు.దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం వరద పరిస్థితుల నేపథ్యంలో 16 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది.
అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ తో పాటు 47 రెస్క్యూ బోట్లను సిద్ధం చేసింది.