నందమూరి బాలకృష్ణ ( Balakrishna )ప్రస్తుతం చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ( Bhagavath Kesari )షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే బాబీ దర్శకత్వంలో ఇప్పటికే కమిట్ అయ్యి ప్రకటన చేసిన సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ పెట్ లోని సారధి స్టూడియో లో ఒక భారీ సెట్ ను వేస్తున్నారు.అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు ఇప్పటికే కసరత్తు ప్రారంభం అయ్యింది.దాదాపుగా 150 మంది ఫైటర్స్ 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటరు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే బాలయ్య ఈ సినిమా లో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.అది కూడా తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.బాలయ్య గత చిత్రం వీర సింహా రెడ్డి సినిమా లో.చెన్న కేశవ రెడ్డి సినిమా ( Chenna Kesava Reddy )లో కూడా తండ్రి కొడుకు గా కనిపించిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే తరహా లో ఈ సినిమా కథ ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వీర సింహా రెడ్డి( Veera Simha Reddy ) కథ ఏమీ లేకపోవడం వల్లే ఆశించిన స్థాయి లో భారీ వసూళ్లు నమోదు అవ్వలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.మళ్లీ అలాంటి కథ నే బాబీ ఎంపిక చేసుకుంటే ఏం బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కానీ మాకు అందిన సమాచారం ప్రకారం సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.
ఒక మంచి పొలిటికల్ డ్రామా గా సినిమా ను బాబీ రూపొందించబోతున్నాడు అంటున్నారు.కనుక కథ గురించి మీడియా లో జరుగుతున్న వార్తలు పుకార్లే.బాలయ్య, బాబీ సినిమా కు వీర సింహారెడ్డికి పోలిక ఉండదని యూనిట్ మెంబర్స్ నమ్మకంగా చెబుతున్నారు.