లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్ ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ కనిపిస్తుంది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి ఇండియా గర్వించదగ్గ నటులు నటించారు.ఇందులో ఫాహద్ ఫజిల్ నటించిన క్యారెక్టర్ లో మన తెలుగు హీరో అయిన సందీప్ కిషన్ ని చేయమని ఆ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ అడిగినప్పటికి ఆయన ఈ క్యారెక్టర్ చేయను అని చెప్పాడట…
దాంతో ఫాహద్ ఫజిల్ ని తీసుకున్నాడు డైరెక్టర్ లోకేష్… మొదట సందీప్ కిషన్ ని ఎందుకు అడిగాడంటే సందీప్ తో ఆల్రెడీ నగరం అనే సినిమా చేశాడు లోకేష్…నగరం సినిమానే లోకేష్ ఫస్ట్ సినిమా ఇది పెద్ద సక్సెస్ కాలేదు కానీ ఓకే అనిపించుకుంది.ఆ చనువుతోనే లోకేష్ సందీప్ ని ఈ క్యారెక్టర్ చేయమని అడిగాడు కానీ సందీప్ చేయలేదు అయితే విక్రమ్ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ క్యారెక్టర్ ని అనవసరంగా మిస్ అయ్యాను అని చాలా భాద పడుతున్నాడు సందీప్…
ఈ సినిమా అటు తమిళ్ ఇటు తెలుగులో చాలా పెద్ద సక్సెస్ అందుకుంది చివర్లో సూర్య చేసిన రోలెక్స్ రోల్ అయితే అద్భుతం అనే చెప్పాలి.ఆ క్యారెక్టర్ కి తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు… అయితే దీనికి కొనసాగింపు గా నెక్స్ట్ విక్రమ్ 2 సినిమా కూడా ఉంటుందని డైరెక్టర్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు… ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు లోకేష్ ఈ సినిమా తర్వాత విక్రమ్ 2 సినిమా ఉంటుందని సమాచారం…