టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ 10 సినిమాలు ఇవే!

దేశంలో కరోనా కారణంగా మూసివేయబడిన థియేటర్లు కరోనా కేసులు తగ్గిన తర్వాత మళ్ళీ తెరుచుకున్నాయి.కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవల విడుదలైన సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లు మూటగట్టుకున్నాయి.

 Here Are The Top 10 Highest Rating Movies In Tollywood Details, Tollywood, Top-TeluguStop.com

ఏ సినిమా అయినా అది అమ్ముడుపోయిన రేటు కంటే థియేటర్ల వద్ద చేసిన కలెక్షన్లను బట్టి హిట్ సినిమాల గా పరిగణిస్తారు.ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా సహా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు గురించి తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.ఈ సినిమా థియేటర్ల వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకొని బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు బ్రేక్ చేసింది.ఇప్పటివరకు ఈ సినిమా రూ.111 కోట్ల లాభాలతో మూడో స్థానంలో నిలువగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి ద బిగినింగ్” , “బాహుబలి 2” సినిమాలు అత్యధికంగా రూ.694 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా మొత్తంగా రూ.39.72 కోట్ల లాభాలు సొంతం చేస్తుంది.

Telugu Bahubali, Gita Govindam, Pushpa, Rangasthalam, Telugu, Tollywood, Top-Mov

అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమా ఓవరాల్ గా రూ.75.88 కోట్ల లాభాలను మూట గట్టుకొని 2020 సంవత్సరంలో ఎక్కువ లాభాలు సాధించిన సినిమాగా నిలిచింది.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతా గోవిందం సినిమా ఓవరాల్ గా రూ.70 కోట్ల షేర్‌తో పాటు రూ.55.43 కోట్ల లాభాలాను మూటగట్టుకుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా నిర్మాతలకు రూ.50 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమా రూ.20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రూ.31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

Telugu Bahubali, Gita Govindam, Pushpa, Rangasthalam, Telugu, Tollywood, Top-Mov

ఇదిలా ఉండగా 2018 లో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా రూ.47.52 కోట్ల లాభాలను తెచ్చి పెట్టి ఆ సంవత్సరానికి గాను హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.సోగ్గాడే చిన్నినాయన సినిమా మొత్తం రూ 50 కోట్ల లాభాలు సొంతం చేసుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా రూ.39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube