ఇతడు మామూలు అదృష్టవంతుడు కాదు.. మర్డరర్స్ కాలుస్తుంటే ఎలా తప్పించుకున్నాడో చూడండి..

కొంతమందికి అదృష్టం గుమ్మడికాయ అంత రాసిపెట్టి ఉంటుంది.మృత్యువు వెంటాడుతున్నా అదృష్టం వల్ల వీరు ఆశ్చర్యకరంగా చావు నుంచి బయటపడుతుంటారు.

 He Is Not An Ordinary Lucky Man  See How He Escaped When The Murderers Were Shoo-TeluguStop.com

అలాంటి అదృష్టవంతుడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వైరల్ వీడియోలో ఒక యువకుడిపై బైక్ పై వెళ్తున్న మరో వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపించడం మనం చూడవచ్చు.ఆ సమయంలో బాధిత యువకుడు ఒక పిల్లర్‌ చాటున దాక్కొని బుల్లెట్లు తగలకుండా తప్పించుకోగలిగాడు.బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఆ యువకుడికి తగిలేలా చాలానే బుల్లెట్లు కాల్చాడు.

కానీ వాటన్నిటినీ పిల్లర్ పక్కన దాక్కొని యువకుడు ఎలాగోలా బుల్లెట్లు తగలకుండా జాగ్రత్త పడ్డాడు.అనంతరం అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు.

ఈ భయానక సంఘటనకు సంబంధించిన వీడియోను చీటింగ్ డెత్ అనే ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్‌కు ఇప్పటికే 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఇతను చాలా లక్కీ బాయ్ అని కామెంట్లు చేస్తున్నారు.ఆ తుపాకీ పేల్చిన వ్యక్తికి సరిగా గురి లేదు, ప్రతి షార్ట్ మిస్ అయ్యాడు.ఇలాంటి వారిని హైర్‌ చేసుకుంటే తిరిగి డబ్బులు బొక్క అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.

తుపాకీ కాల్చేటప్పుడు ఒక బుల్లెట్ సదరు యువకుడు పక్కనే ఉన్న బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కి తగిలింది.అయినా ఆ బైక్ పేలలేదు.

పేలి ఉంటే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యుండేవి.ఆ విషయంలోనూ యువకుడు చాలా లక్కీ అని ఇంటర్నెట్ యూజర్లు పేర్కొంటున్నారు.

బుల్లెట్ల( Bllets ) నుంచే తప్పించుకున్నాడు అంటే అతడంత లక్కీయస్ట్ పర్సన్ మరెవరూ ఉండరని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.చాలా క్లోజ్, ఎట్టకేలకు తప్పించుకున్నాడు అతను గ్రేట్ అని ఇంకొకరు అన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube