ఐఫోన్లు గురించి ప్రపంచ జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇవి చూడడానికి సైజులో చిన్నగా ఉంటాయి.
కానీ ఈ మినీ కాన్సెప్ట్‌కి స్వస్తి పలుకుతూ గతేడాది ఐఫోన్ డిస్‌ప్లే సైజు పెంచిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలోనే ఐఫోన్ ప్రో మ్యాక్స్( iPhone Pro Max ) వెర్షన్లలో 6.7 అంగులాల డిస్‌ప్లే తీసుకు వస్తోంది.ఇప్పటివరకు ఇదే భారీ ఐఫోన్‌గా నిలుస్తోంది.
అయితే దీని కన్నా పెద్ద ఐఫోన్ ఒకటి న్యూయార్క్( New York ) వీధుల్లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.అవును, అయితే ఈ ఐఫోన్ అంగులాలలో కాదు.
ఏకంగా అడుగుల సైజులో ఉండటం విశేషం.ఇంతకీ ఎన్ని అడుగులంటే 8 అడుగులు.
ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమండి.ప్రముఖ యూట్యూబర్ మ్యాథ్యూ బీమ్( Matthew beem )ప్రపంచంలోనే అతి పెద్దనైన ఐఫోన్‌ను తయారు చేసి ఏకంగా ఐఫోన్ కంపెనీకే షాక్ ఇచ్చాడు.ఇది ఏకంగా 8 అడుగుల ఎత్తు ఉండడంతో చూపరులు అవాక్కయి మరీ చూస్తున్నారు.గతంలో ZHC అనే యూట్యూబర్ 6 అడుగుల ఐఫోన్‌ని తయారు చేసి ప్రపంచ రికార్డుని నెలకొల్పగా ఈ రికార్డును, 8 ఫీట్ల ఐఫోన్‌తో మ్యాథ్యూ ఇప్పుడు బ్రేక్ చేశాడు.
బయటి నుంచి చూస్తే అచ్చం ఐఫోన్‌లా ఉండటం దీని ప్రత్యేకత.డిజైన్, బటన్లు, ఫినిషింగ్.ఇలా అన్ని విషయాల్లో ఒరిజినల్ ఐఫోన్‌లా ఉండేలా మ్యాథ్యూ బృందం దీన్ని తీర్చిదిద్దడం విశేషం.
ఇక కేవలం లుక్ పరంగానే కాకుండా ఇంటర్నల్‌గానూ ఇది ఇతర ఐఫోన్ల మాదిరిగానే కనిపిస్తోంది.ఇతర ఐఫోన్లు చేసే అన్ని ఫంక్షన్లను ఈ భారీ ఐఫోన్ చేయడం ఇందులో విశేషత అని చెప్పుకోవచ్చు.ఇంత భారీ సైజు ఉన్నప్పటికీ ఓ ప్రామాణిక ఐఫోన్‌లా పనిచేస్తుంది.
ఈ ఐఫోన్‌కి సంబంధించిన వీడియోను మ్యాథ్యూ బీమ్ షేర్ చేశారు.ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ భారీ ఐఫోన్‌ను న్యూయార్క్ నగర విడ్డుల్లోకి తీసుకెళ్లడంతో ఈ ఎనిమిది అడుగుల భారీ డివైజ్ చూడటానికి జనాలు క్యూలు కడుతున్న పరిస్థితి వుంది.
కావాలంటే మీరు కూడా ఈ వీడియోని చూసి ఆ అనుభూతిని పొందవచ్చు.