టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) దర్శకత్వంలో తేజ సజ్జా( Teja Sajja ) హీరోగా నటించిన సినిమా హనుమాన్.( Hanuman Movie ) తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా మేనియానే ఎక్కువగా కనిపిస్తోంది.హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
రిలీజ్ కి ముందు థియేటర్ల ఇబ్బందులు, బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా కష్టాలు పడి మూడేళ్ళ పాటు సినిమాని చేసి రిలీజ్ చేశారు.
ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చి కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి.
అయితే సినిమా విడుదలకు ముందు కూడా చాలామంది ఈ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడారు.కానీ అవి ఏవి పట్టించుకోకుండా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా అందరి నోర్లు ముగించింది.
అంతేకాకుండా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు మూవీ మేకర్స్. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కొందరు కావాలనే సినిమా పై, సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు( Negative Comments ) చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం గురించి ఇష్టమొచ్చినట్టు పోస్ట్ చేస్తున్నారు.
ఒక నెటిజన్ ప్రశాంత్ వర్మ పేరుతోనే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.చరణ్( Ram Charan ) నన్ను డిన్నర్ కి పిలిచి నాతో సినిమా చేయమని అడిగాడు, నేను నో చెప్పాను అంటూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారు.ఇలా డైరెక్టర్, సినిమాపై కొంతమంది నెగిటివ్ గా పోస్టులు చేస్తున్నారు.
తాజాగా ఆ పోస్టులపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందిస్తూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ తో( Fake Profiles ) చాలా మంది మా టీం మీద, సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
నిన్న భోగి రోజు( Bhogi ) ఇలాంటి డిజిటల్ చెత్తని మంటల్లోకి విసరడం మర్చిపోయినట్టు ఉన్నారు.ఏది ఏమైనప్పటికి ధర్మం కోసం నిలబడే వాడు ఎప్పటికైనా గెలుస్తాడు అని మా నమ్మకాన్ని నిజం చేస్తూ మా సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.హనుమాన్ గాలిపటం ఈ సంక్రాంతికి మరింత ఎత్తుకు ఎదగడానికి సిద్ధంగా ఉంది అని పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. కాగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.