మాస్ మసాలా సినిమాలు అంటే హీరోగారు చేసే ఫైట్స్ మీద ఎంత శ్రద్ధ తీసుకుంటారో, అలాగే హీరోయిన్లు వేయాల్సిన బట్టల మీద కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు.ఫైట్స్ నిడివి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, అలాగే బట్టల సైజు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.
ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు మాస్ సినిమాల డైరెక్టర్లు.సంపత్ నంది కూడా ఆ కోవకి చెందిన మాస్ దర్శకుడే.
గత చిత్రం బెంగాల్ టైగర్ లో తమన్నా, రాశి ఖాన్న పోటిపడి అందాలు ఆరబోయడం చూసాం.ఈసారి గౌతమ్ నందలో కూడా అలాంటి విజువల్స్ ఉండబోతున్నాయట.
ఈ విషయాన్ని ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరైన కాథెరిన్ త్రేసా స్వయంగా చెప్పింది.
కథలో చాలా కీలకమైన పాత్ర అంట కాథెరిన్ ది.హన్సికకు తనకు మంచి పాత్రలు లభించాయని, ఇద్దరివి సమానమైన పాత్రలు అలాగే కథను నడిపించే పాత్రలు అని చెబుతోంది కాథెరిన్.ఇక గ్లామర్ విషయానికి వస్తే, ఏ సినిమాలో కూడా కనిపించనంత గ్లామరస్ గా గౌతమ్ నంద సినిమా కోసం కనిపించానని, ఇందులో తన బికినీ సీన్ హైలెట్ అవుతుందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
అయితే గ్లామర్ విషయంలో కేవలం తనకే అగ్రతాంబూలం దక్కలేదని, హన్సిక కూడా బాగా స్కిన్ షో చేసిందని, తన గ్లామర్ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది కాథెరిన్.
కాబట్టి, కథాకథనాలు ఎలా ఉండబోతున్నాయో తెలియదు కాని, గ్లామర్ డోసు వరకు డోకా లేదు అన్నమాట.
ఈ సినిమా హిట్ అవడం అందరికి అవసరమే.సంపత్ నంది ఇంకా సరిగా నిలదొక్కుకోలేదు.
గోపీచంద్ హిట్ కొట్టి చాలాకాలమైంది.హన్సిక తెలుగులో మళ్ళీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది అలాగే కాథెరిన్ కు అవకాశాలు కావాలి.
మరి గౌతమ్ నంద సక్సెస్ అయ్యి హీరో దర్శకుడి కెరీర్ కి ఉపయోగపడుతుందా లేక ఫలితంతో సంబంధం లేకుండా గ్లామర్ లెక్కల మీద ఇద్దరు హీరోయిన్ల కెరీర్ కి ఉపయోగపడుతుందా చూడాలి.