యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల కేంద్రంలో మీసేవ ఆన్లైన్ సెంటర్లలో ప్రజలు కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి.బీసీ బంధు పేరుతో కులాల వారిగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కొరకు పడిన అవస్థలు మరవక ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో ప్రజలను మరో మరో పథకం ప్రవేశ పెట్టడంతో మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు 10 ఆఖరి తేదీ కావడంతో ఆన్లైన్ కేంద్రాలు,రెవిన్యూ కార్యాలయం కిటకిట లాడుతున్నాయి.అయితే వైన్స్ టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చి సర్కార్ పేదవారికిచ్చే ఇండ్లు ఇచ్చే గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే మండలంలో బీసీ బంధు కోసం 786 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కరికి కూడా ఇవ్వలేదని అంటున్నారు.గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి విధివిధానాలు ఏమిటని తహసిల్దార్ మంగను వివరణ కోరగా సొంత ఇంటి స్థలం ఉన్నవారు మాత్రమే అర్హులని,పూర్తి వివరాలు విధివిధానాలు మాకు అందలేదని చెప్పగా,ఇదే విషయమై స్థానిక ఎంపీపీ అమరావతి ను వివరణ కోరగా ప్రస్తుతానికి ప్రజలు ఇచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకుంటున్నామని ఇంకా పూర్తి వివరాలు లేవని చెప్పడం గమనార్హం.
గృహలక్ష్మి పథకం మరో ఓట్ల స్కీమ్ మాత్రమేనని దరఖాస్తుదారుడు జోగు రమేష్ అన్నారు.గృహలక్ష్మి పథకం కేవలం కేసీఆర్ సర్కార్ ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడమే.
తొమ్మిదేళ్లుగా గుండాల మండలంలోని 20 గ్రామాల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు.కేవలం మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు.
ఈ సమయంలో ఆదాయ, కుల సర్టిఫికెట్లు ఇవ్వాలంటే వారం రోజులు పడుతుందని తాహసిల్దార్ కార్యాలయం వారు తెలుపుతున్నారు.ఇది కేవలం ప్రజలకు ఇల్లు నిర్మించాలని కాకుండా ఓట్ల కొరకు ఆడే ఒక డ్రామా మాత్రమేనని చెప్పారు.