గొంగళి పురుగుపై రీసెర్చ్‌ చేస్తున్న గొరిల్లా.. వీడియో వైరల్!...

కాలం మారింది.ఏ చిన్న ఘటన కాస్త ఆశ్చర్యం కలిగించిన వారు చూసి మాత్రమే ఆగిపోకుండా వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 Gorilla And Its Baby Observing Caterpillar Leaves Twitter Mesmerised Viral Vid-TeluguStop.com

ఆ వీడియో నెటిజన్లకు నచ్చడంతో ఒకరోజు అంత వైరల్ అవుతున్నాయి.ఇప్పుడైతే పక్షులు, జంతువుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

గతంలో ఎన్నడూ చూడని వీడియోలు కావడంతో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో ఏంటంటే.గొరిల్లా దాని పిల్ల క‌లిసి గొంగ‌ళి పురుగును కళ్లు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాయ్.

ఇది ఏంటి వింత జీవిలా ఉందే అన్నట్టు అంత ఎత్తులో ఉండే గొరిళ్లాలు కిందికి వంగి వంగి మరీ పురుగును చూశాయి.రీసెర్చ్ కోసం ప‌రిశోధ‌కులు కూడా ఆ గొంగళి పురుగును అంత బాగా చూడరు ఏమో.అంత బాగా పురుగును గ‌మ‌నించాయి.

గొరిళ్లాలు జరిపిన ఈ రీసెర్చ్‌లో ఫలితం ఏం వచ్చిందో తెలియదు కానీ అవి రీసెర్చ్ చేసే పద్ధతి మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేసి ఎప్పుడు నెటిజన్లను అక్కట్టుకునే భారతదేశ అటవీ శాఖ అధికారి సుశాంత్ నంద ఈ వీడియోను షేర్ చేశారు.”బాగా గ‌మ‌నించండి.సిల్వ‌ర్‌బ్యాక్, పిల్ల‌వాడు గొంగ‌ళి పురుగును గ‌మ‌నిస్తుంది” అంటూ క్యాప్షన్ పెట్టారు.నెటిజన్లను ఆకట్టుకున్న ఈ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube