కమలా హారీస్ ప్రధాన ఆయుధం అదొక్కటే..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి చివరికి ఉపాధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ వేసిన కమలా హారీస్ తనదైన ప్రత్యేకమైన శైలిలో దూసుకుపోతున్నారు.

ఒక వైపు భారత హిందూ మహిళగా మరో వైపు ఆఫ్రో ఇండియన్ మహిళగా రెండు వైపులా ఆమెకి భారీ మద్దతు లభిస్తోంది.

ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని అంగీకారం తెలుపుతూ నామినేషన్ వేసిన కమలా హారీస్ ప్రజలని ఉద్దేశించి మాట్లాడారు.జాతి వివక్షనే ప్రధాన ఆయుధంగా చేసుకున్న కమలా హారీస్ ఆదిసగా చేసిన ప్రసంగం అందరిని కట్టిపడేసిందనే చెప్పాలి.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత జాతి వివక్ష హెచ్చుమీరిందని, ట్రంప్ ఈ వివక్షని మరింత పెంచి పోషించారని ఆరోపించారు.ఈ జాతి వివక్షకి మందు లేదని ఆమె ఘాటుగా స్పందించారు.

అయితే కేవలం డెమోక్రటిక్ పార్టీ మాత్రమే ఈ రోగాన్ని తరిమి కొట్టగలదని, ప్రజా మద్దతుతో అధికారంలోకి వస్తే తప్పకుండా జాతి వివక్షపై ఉక్కుపాదం మోపుతామని ఆమె హామీ ఇచ్చారు.దేశంలో మైనారిటీలకి రక్షణ లేకుండా పోవడానికి జాతి వివక్ష ప్రధాన కారణమని ఆమె అన్నారు.

Advertisement

ట్రంప్ పాలనలో కొన్ని నెలల క్రితం నేలకొరిగిన జార్జ్ ఫ్లాయిడ్, బ్రూనన్ లు ఇద్దరూ కేవలం జాత్యంహంకారం కారణంగా మృతి చెందారని వారి మృతి జాత్యంహంకారంపై పూర్తి స్థాయిలో ఉద్యమించేలా పునాదులు వేసినని ఆమె అన్నారు.వారి ఆత్మలకు శాంతి కలగాలంటే తప్పకుండా ఈ పోరులో తనతో పాటు ముందుకు నడవాలని కమలా హారీస్ పిలుపునిచ్చారు.ఇది ఇలా ఉంటే కమలా హారీస్ తాజా ప్రసంగాన్ని పరిశీలించిన నిపుణులు ఈ ఎన్నికల్లో కమలా హారీస్ జాత్యహంకార నిర్మూలనే ప్రధాన ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్లనున్నదని అంటున్నారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు