యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎన్నో ఆటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఈమె ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
మార్చి 6వ తేదీన ఈ సినిమా నుంచి భారీ సర్ప్రైజ్ రానుందని సమాచారం అందుతోంది.
మార్చి నెలలో ఈ సినిమాకు సంబంధించి వరుస సర్ప్రైజ్ లు రానున్నాయని సమాచారం అందుతోంది.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా మార్చి 6వ తేదీన జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో ఆరోజే జాన్వీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది.జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి జాన్వీకి టెస్ట్ షూట్ పూర్తైంది.మార్చి నెల మూడో వారంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది.మార్చి నెల చివరి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా తారక్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
తారక్ ఈ సినిమా కథలో మార్పులు చెప్పారని తారక్ చెప్పిన మార్పులకు అన్గుణంగానే ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.ఈ సినిమాలకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.