దేవుడా: ఆ బ్యాగ్ లో అంత ఏం ఉంది.. ఏకంగా అంత ధర..!

సాధారణంగా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఉంటుంది? మహా అంటే వెయ్యి లేదా 10,000 లోపే మహిళల హ్యాండ్ బ్యాగ్ ధరలు ఉంటాయి.ఇక మిగతా బ్యాగులు కూడా దాదాపు అదే తరహా రేట్లలో ఉంటాయి.

 God: What's In That Bag So Much Price, Costly Bag, 2000 Dollers, Bag, Viral New-TeluguStop.com

క్వాలిటీ ని బట్టి ధరలు చెప్తూ ఉంటారు.కానీ మరీ లక్షల రూపాయల ధరలకు బ్యాగులను అమ్మకానికి పెడితే ఎంత ధనికులకైనా విడ్డూరంగానే అనిపిస్తుంది.

అయితే ఇప్పుడు కూడా ఒక షాపింగ్ బ్యాగ్ ధర అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది.దాని ధర తెలుసుకుని చాలా మంది అవాక్కవుతున్నారు.

అంత డబ్బు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? వెయ్యి రూపాయలతోనే ఒక మంచి సరుకుల సంచి కొనుక్కోవచ్చు కదా? అయినా అంత ధరకు అమ్మకానికి పెట్టడానికి దాంట్లో ఉన్న ప్రత్యేకతలేంటో? అని ప్రస్తుతం నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఇంతకీ ఆ బ్యాగ్ ఏంటి.

దాని ధర ఏంటో తెలుసుకుంటే.బలెన్సియగా(Balenciaga) అనే ల‌గ్జ‌రీ ఫ్యాష‌న్ బ్రాండ్ ఒక షాపింగ్ బ్యాగ్‌ను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది.

దాని ధర 2090 డాల‌ర్లట.అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.1 లక్ష 53 వేలు.ఆశ్చర్యపోయారు కదూ.ఈ ధర చూసి ప్రతి ఒక్కరికీ క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఖరీదైన షాపింగ్ బ్యాగ్‌ వివరాలను తెలియజేస్తూ దాని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

బలెన్సియగా బ్రాండ్.పిష్వీ (pishvi) బ్యాగ్‌ను 2000 యూఎస్ డాల‌ర్లకు విక్రయిస్తోందని ఆ నెటిజన్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఇంత ఖ‌రీదైన బ్యాగును చూస్తాన‌ని తాను ఇప్పటివరకూ ఊహించనేలేదు అంటూ తన పోస్టుకు క్యాప్షన్ గా జోడించారు.దాంతో ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

అన్నట్లు ఆ బ్యాగ్‌ పేరు పిష్వీ అనేది ఒక మరాఠీ పదం.తెలుగులో సంచి అని దీనర్థం.కూరగాయలు, ఇంకా ఏవైనా వస్తువులు క్యారీ చేసే ఈ స‌రుకుల సంచి ధర ఇంతుందేంటీ? అంటూ ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube