కాంగ్రెస్ ని పుత్ర ప్రేమే వెన‌క్కి నెడుతోందా..?

ఎవ‌రికైనా కొడుకుని ప్ర‌యోజ‌కుడిని చేయాల‌నే ఉంటుంది.అందుకే దానికి కావాల్సిన ఏర్పుట్లు కూడా ముందుగానే చేసుకుంటారు.

 Ghulam Nabi Azad Shocking Comments About Rahul Gandhi In His Resignation Letter-TeluguStop.com

గొప్ప క‌ల‌లు కంటారు.ఆ దిశ‌గా అడుగులు వేసేలా స‌హ‌క‌రిస్తారు.

అయితే ఈ క్ర‌మంలో పిల్ల‌లు త‌ప్పు చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు.కానీ పరిస్థితి చేదాటిపోతుంద‌నుకున్న‌ప్పుడు మాత్రం మారాల్సిందే.

స‌ల‌హాలు సూచ‌న‌లు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిందే… కానీ ప‌ట్టించుకోకుండా త‌మ‌కు న‌చ్చిందే చేసుకుంటూ పోతే చివ‌ర‌కి జ‌రిగే న‌ష్టాన్ని ఎవ‌రూ ఆలేరు.ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.దేశంలో ఒక శతాధిక వృద్ధ పార్టీ కూడా పుత్ర ప్రేమ కారణంగా కృంగి పోతోందా… అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి గ‌నుక‌.

సీనియ‌ర్లు గుడ్ బై…

ఇన్నిరోజులు కాంగ్రెస్ పార్టీని మోసుకుంటూ వ‌చ్చిన సోనియా గాంధీ.కొడుకు రాహుల్ గాంధీ చేతిలో పెట్టే ప్ర‌య‌త్నం చేసింది.కానీ రాహుల్ కి రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేని కార‌ణంగా.పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని సీనియర్లు అనదగ్గ పునాదులు ఇపుడు కాంగ్రెస్ భవనాన్ని కదిలిస్తున్నాయి.పార్టీలో ఉండలేమని చెబుతున్నారు.

కొంద‌రు గుడ్ బై చెప్పేస్తున్నారు.కాంగ్రెస్ అంటే తాను అని దాదాపుగా అయిదు దశాబ్దాల బంధాన్ని పెనవేసుకున్న నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి గుడ్ బై కొట్టారు అంటే పుత్ర ప్రేమతో సోనియా గాంధీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఆరోపించడమే.

ఈ మేరకు గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ లో తన సుదీర్ఘమైన ప్రస్థానాన్ని నాలుగు పేజీల లేఖ ద్వారా రాసుకువచ్చారు.

Telugu Congress, Gandhi, Ghulamnabi, Gulam Nabi Ajad, Indira Gandhi, Rahul Gandh

అందులో ఆయన ఇందిరా గాంధీ నుంచి తన తన రాజకీయాన్ని మొదలెట్టి సోనియా గాంధీ దాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించానని చెప్పుకొచ్చారు.1977 ప్రాంతంలో కాంగ్రెస్ యువజన విభాగానికి సంజయ్ గాంధీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ప్రధాన కార్యదర్శిగా తాను ఉంటూ ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది చెప్పుకొచ్చారు నాటి జనతా పార్టీ ప్రభుత్వం మీద ఎలా పోరాడింది కూడా వివరించారు.సంజయ్ గాంధీ మరణం తరువాత రాజీవ్ గాంధీ కూడా తొలుత యువజన కాంగ్రెస్ తోనె తన ప్రస్థానం మొదలెట్టారని ఆయన పక్కన తాను ఉన్నానని చెప్పుకున్నారు.

ఇక ఇందిరా, రాజీవ్, పీవీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పలు మార్లు పనిచేసి ఎన్నో కీలకమైన శాఖలను చూశాన‌ని గులాబ్ నబీ ఆజాద్ చెప్పుకున్నారు.సోనియా గాంధీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె నాయకత్వాన రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆజాద్ గుర్తు చేశారు.

రాహుల్ ఉంటే క‌ష్టం…

Telugu Congress, Gandhi, Ghulamnabi, Gulam Nabi Ajad, Indira Gandhi, Rahul Gandh

ఇక సీనియర్ల సలహాలు వింటూ వాటిని అమలులో పెడుతూ పార్టీని సోనియా ఒక గాటిన నడిపించారని ప్రస్తుతించారు.ఎపుడైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేషించారో నాటి నుంచే పతనం మొదలైంది అని ఆజాద్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు.2013లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక సీనియర్లను పక్కన పెట్టి ఏ మాత్రం అనుభవం లేని జూనియర్ లతో కొత్త కోటరీ తెచ్చి పార్టీని నాశనం చేశార‌ని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని ఆయన ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని తేల్చేశారు.

ఇక 2020లో కాంగ్రెస్ ని ప్రక్షాళన చేయమని తొలిసారిగా గట్టిగా లేఖ రాసిన గులాబ్ నబీ ఆజాద్ రెండేళ్ల పాటు ఉగ్గబట్టినా పార్టీ తీరు మారలేదు అంటున్నారు.చివరికి అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు.

Telugu Congress, Gandhi, Ghulamnabi, Gulam Nabi Ajad, Indira Gandhi, Rahul Gandh

ఇక్కడ ఆజాద్ వంటి సీనియర్ చెప్పిన మాటలను కొన్ని పరిగణనలోకి తీసుకుంటే 2013 నుంచి కాంగ్రెస్ లో రాహుల్ రాజ్యం నడుస్తోంది అనే తెలుసోంది.సోనియా గాంధీ కూడా కొడుకు మాటను కాదనలేక ఓకే చెబుతున్నారు అని అంటున్నారు.ఫలితంగా పార్టీ తీవ్రంగా నష్టపోతోంది అని అంటున్నారు.రాహుల్ చైల్డిష్ గా వ్యవహరిస్తార‌ని ఘాటైన మాటనే ఆయన వాడారు.ఇక రాహుల్ తన తండ్రి రాజీవ్ నుంచి కానీ నాన్నమ్మ ఇందిరమ్మ లా కానీ బాబాయ్ సంజయ్ లా కానీ డైనమిక్ లీడర్ కారనే ఆజాద్ అంచనా కట్టేశారు.ఇక ఆయన్ని నిరోధించి పార్టీని బ్యాలన్స్ చేయడం సోనియా వల్ల కావడంలేదు అన్న అంచనాతోనే ఆజాద్ పార్టీకి స్వస్తి చెప్పార‌ని అంటున్నారు.

ఒక సీనియర్ మోస్ట్ నేత వెళ్లిపోతే ఆయన రాజీనామా ప్రభావం పార్టీ మీద తీవ్రంగానే ఉంటుంది అంటున్నారు.అన్నింటికీ మించి రాహుల్ వల్ల కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాద‌ని ఆయన అన్న మాటలు పార్టీలో అనుమానాలు రేక్కెత్తించిన‌ట్లే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube