మన దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో గేట్ పరీక్ష( GATE Exam ) ఒకటి.గేట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తే కూడా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సులువుగా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
అదే సమయంలో ప్రముఖ ఐఐటీ, ఎన్.ఐ.టీలలో ఎంటెక్ పూర్తి చేసి లక్షల రూపాయల ప్యాకేజీలతో కొలువు సాధించే అవకాశం ఉంటుంది.అయితే యూట్యూబ్ వీడియోల ప్రిపరేషన్ తో ఏడెల్లి సాయికిరణ్( Adelly Sai Kiran ) అనే వ్యక్తి గేట్ ర్యాంక్ సాధించారు.
ప్రతి సంవత్సరం గేట్ పరీక్ష కోసం 8 లక్షల మంది ప్రిపరేషన్ సాగిస్తే చలా తక్కువ మంది మాత్రమే గేట్ ర్యాంక్ సాధించగలరు.గేట్ పరీక్షలో ఈఈఈ విభాగంలో ఏడెల్లి సాయికిరణ్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా సాయికిరణ్ తన సక్సెస్ స్టోరీని( Success Story ) నెటిజన్లతో పంచుకున్నారు.
సాయికిరణ్ పేరెంట్స్ గవర్నెమెంట్ టీచర్లుగా పని చేస్తుండగా చెల్లి ఇంటర్ చదువుతున్నారు.జేఈఈ పరీక్ష రాసిన సమయంలో సాయికిరణ్ నేషనల్ లెవెల్ లో 7వ ర్యాంక్ సాధించారు.

ఖరగ్ పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్( Electrical Engineering ) చేరిన సాయికిరణ్ మూడు నెలల ప్రయత్నంలోనే గేట్ లక్ష్యాన్ని సాధించారు.రోజుకు 10 గంటలు ప్రిపేర్ అయిన సాయికిరణ్ కొన్ని చాప్టర్ల ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ వీడియోలపై( Youtube Videos ) ఆధారపడ్డారు.నచ్చని సబ్జెక్ట్ లను ఎంచుకుని ఇబ్బందులు పడవద్దని విద్యార్థులకు సాయికిరణ్ సూచనలు చేశారు.ఏస్ అకాడమీ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ నాకు ఎంతగానో ఉపయోగపడిందని సాయికిరణ్ చెప్పుకొచ్చారు.

ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సక్సెస్ సొంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల మంచి కాలేజ్ లో సీటు దొరుకుతుందని ఏ కాలేజ్ లో చేరాలో ఆలోచించడంతో పాటు మంచి జాబ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నానని సాయికిరణ్ అన్నారు.సాయికిరణ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.