చిరంజీవి సినిమాలో నటించబోతున్న గద్దర్.. క్రేజీ అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

 Gaddar Will Appear In Chiranjeevis Latest Movie God Father, Gaddar, Chiranjeevi,-TeluguStop.com

ఈ క్రమంలోనే తన తరువాత సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న టువంటి “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మలయాళం సూపర్ హిట్ మూవీ “లూసిఫర్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం వివిధ భాషల నుంచి బాగా ఫేమస్ అయిన సెలబ్రెటీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రజా యుద్ధ నౌక, జననాట్యమండలి కళాకారుడు గద్దర్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ విషయం గురించి గద్దర్ ను సంప్రదించగా అందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తరువాత చిత్రీకరించబోయే షెడ్యూల్ లో భాగంగా గద్దర్ పై సన్నివేశాలను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube