కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే అని జోస్యం చెప్పిన ప్రకాష్ రాజ్

ఈ సారి కేంద్రంలో ఏడ్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.ఇటీవల బీజేపీ పార్టీ పై,ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Front Government In Central-TeluguStop.com

కర్ణాటక లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురైన తరువాత నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ పార్టీ పై విరుచుకుపడుతున్నారు.ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ మాట్లాడుతూ మనది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అని, ఈ సారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అని కాంగ్రెస్,బీజేపీ కి మెజారిటీ రాదంటూ జోస్యం చెప్పారు.

ఒక పార్టీ కె మెజార్టీ ఇస్తే ఏం జరిగిందో అందరూ చూశారని, అందుకే ఈ సారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది అని ప్రకాష్ తెలిపారు.ప్రాంతీయ పార్టీలు, సంస్కృతులకు అధిక ప్రాధాన్యత ఉండాలని అన్నారు.

ఉగ్రవాద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు ఈ విధంగా బీజేపీ పార్టీ టికెట్టు ఇస్తుంది అని ఆయన ప్రశ్నించారు.సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ మాలే గావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి వాళ్లు పార్లమెంట్ కు వెళ్లి ఎలాంటి చట్టాలు చేస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నానని, విద్యా, వైద్య రంగంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ పని చేసిందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ కొనియాడారు.

కావున పని చేసిన వ్యక్తులను చూసే ప్రజలు ఓటేయాలని ప్రకాష్ కోరారు.బెంగళూరు సెంట్రల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చానని, తనకు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలానే కేసీఆర్ ఫెడరల్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సఫలమౌతాయని ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube