హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiv Balakrishna ) మూడో రోజు ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆధారాలను ముందుంచి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారిస్తున్నారు.
శివబాలకృష్ణ అక్రమాస్తుల వెనుక ఐఏఎస్ అధికారి( IAS officer ) పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎనిమిదేళ్లుగా హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన ఫైల్స్ పై అధికారులు దృష్టి సారించారని సమాచారం.ఫైల్స్ పై సంతకాలకు ఐఏఎస్ అధికారికి మేజర్ వాటా ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో శివబాలకృష్ణ విచారణ తరువాత ఐఏఎస్ అధికారిపై ఏసీబీ విచారణ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందుకోసం ఏసీబీ మరియు ఎంఏయూడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.అలాగే శివబాలకృష్ణ భార్య, బంధువు భరత్( Bharat ) పేరుపై మూడు లాకర్లను గుర్తించారు.బినామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను శివబాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చినట్లు నిర్ధారించారు.ఈ క్రమంలో గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.