Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మూడో రోజు కస్టడీ విచారణ
TeluguStop.com
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiv Balakrishna ) మూడో రోజు ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ఆధారాలను ముందుంచి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారిస్తున్నారు. """/" /
శివబాలకృష్ణ అక్రమాస్తుల వెనుక ఐఏఎస్ అధికారి( IAS Officer ) పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎనిమిదేళ్లుగా హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన ఫైల్స్ పై అధికారులు దృష్టి సారించారని సమాచారం.
ఫైల్స్ పై సంతకాలకు ఐఏఎస్ అధికారికి మేజర్ వాటా ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో శివబాలకృష్ణ విచారణ తరువాత ఐఏఎస్ అధికారిపై ఏసీబీ విచారణ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందుకోసం ఏసీబీ మరియు ఎంఏయూడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.అలాగే శివబాలకృష్ణ భార్య, బంధువు భరత్( Bharat ) పేరుపై మూడు లాకర్లను గుర్తించారు.
బినామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను శివబాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చినట్లు నిర్ధారించారు.
ఈ క్రమంలో గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
వైరల్ అవుతున్న క్లీంకార లేటెస్ట్ ఫోటోలు.. ఎంత ముద్దుగా ఉందో అంటూ?