అదిరిపోయే ఫీచర్ ను తీసుకురాబోతన్న ఫేస్ బుక్..!

ఈ కాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్స్ దర్శనం ఇస్తున్నాయి.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫేస్ బుక్ ని వాడుతున్నారు.

 Facebook Is Going To Bring A Creepy Feature Facebook, Social Media, Twitter, Fa-TeluguStop.com

ఒకవేళ ఫేస్ బుక్ లో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకుని మరి ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు.అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫేస్ బుక్ వినియోగించడం వల్ల అన్నీ సోషల్ మీడియా యాప్స్ కన్నా ఫేస్‌బుక్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన సరికొత్త ఫీచర్లతో మనల్ని అలరిస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే యూజర్లను మరింత అట్రాక్ట్‌ చేసేందుకు గాను ఫేస్‌బుక్‌ మరో సరికొత్త ఫీచర్‌ ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

మరి ఆ ఫీచర్ ఏంటో తెలుసుకుందామా.

మీ అందరికి ట్విట్టర్‌ లో ఉన్న థ్రెడ్‌ అనే ఫీచర్‌ గురించి తెలిసే ఉంటుంది కదా.అలాంటి థ్రెడ్ అనే ఫీచర్ ను ఇప్పుడు ఫేస్‌బుక్‌ లోనూ తీసుకురావాలని చూస్తున్నారట ఫేస్ బుక్ బృందం.మనం ట్విట్టర్‌ లో ఏదన్నా పోస్ట్‌ చేయాలంటే థ్రెడ్‌ ల రూపంలో చేస్తామనే విషయం మన అందరికి తెలిసిందే.

అయితే ఈ సందేశాన్ని కేవలం 280 క్యారక్టర్లలో పోస్ట్‌ చేసే అవకాశం ఉండడం వలన ఇలా థ్రెడ్స్‌ రూపంలో సమాచారాన్ని పోస్ట్ చేస్తారు.ఇప్పుడే ఇలాంటి ఫీచర్‌ ను ఫేస్‌బుక్‌ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

Telugu Thread, Latest-Latest News - Telugu

అయితే ఈ సరికొత్త ఫేస్ బుక్ ఫీచర్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.కానీ ప్రముఖ సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ మాట్‌ నవారా ఈ కొత్త ఫీచర్‌ కు సంబంధించిన వివరాలను స్క్రీన్‌ షాట్‌ తీసి తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు.అయితే ఈ సరికొత్త థ్రెడ్‌ ఫీచర్‌ ఫేస్ బుక్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫేస్ బుక్ వాడకం ఇంకా ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు.

అయితే ఈ కొత్త ఫీచర్‌ గురించిన వివరాలను ఫేస్‌బుక్‌ ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube