AP TDP MPs List : ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై ఉత్కంఠ..!

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీలో ఎంపీ అభ్యర్థుల జాబితా( AP TDP MPs List )పై ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల జాబితా విడదులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 Excitement Over The List Of Tdp Mp Candidates In Ap-TeluguStop.com

ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచనలో ఉందని సమాచారం.ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్( Putta Mahesh Yadav ) పేర్లు తెరపైకి వచ్చింది.

అయితే ఇప్పటికే ఏలూరు స్థానాన్ని కంభంపాటి, డాక్టర్ పవన్, భాష్యం రామకృష్ణ ఆశిస్తున్నారు.

అదేవిధంగా అనంతపురంలో చివరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి( JC Pawan Kumar Reddy ) పేరు కూడా తెరపైకి వచ్చింది.మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ కేటాయించిన ఎంపీ సీట్లలో మార్పులు కావాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు( BJP Leaders ) ఢిల్లీ హైకమాండ్ ను కలిసిన సంగతి తెలిసిందే.విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కమలం నేతలు కోరుతున్నారు.

ఈ క్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube