AP TDP MPs List : ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై ఉత్కంఠ..!
TeluguStop.com
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీలో ఎంపీ అభ్యర్థుల జాబితా( AP TDP MPs List )పై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల జాబితా విడదులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచనలో ఉందని సమాచారం.
ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్( Putta Mahesh Yadav ) పేర్లు తెరపైకి వచ్చింది.
అయితే ఇప్పటికే ఏలూరు స్థానాన్ని కంభంపాటి, డాక్టర్ పవన్, భాష్యం రామకృష్ణ ఆశిస్తున్నారు.
"""/"/
అదేవిధంగా అనంతపురంలో చివరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి( JC Pawan Kumar Reddy ) పేరు కూడా తెరపైకి వచ్చింది.
మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ కేటాయించిన ఎంపీ సీట్లలో మార్పులు కావాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు( BJP Leaders ) ఢిల్లీ హైకమాండ్ ను కలిసిన సంగతి తెలిసిందే.
విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కమలం నేతలు కోరుతున్నారు.
ఈ క్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.