మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే మొదటి నుంచి పార్టీకోసం పనిచేస్తే తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని అందుకే రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు.దీంతో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆ పార్టీ నేతలతో భేటీ అయినట్లు తెలుస్తుంది.దీంతో రాజీనామా చేయొద్దని పలువురు టీఆర్ఎస్ ప్రముఖులు బుజ్జగించినా వినడం లేదట.
ప్రత్యేకంగా చర్చలు పెట్టినా ఫలించడం లేదట.ఇన్నాళ్లు ఎన్నో అవమానాలు భరించానని.
ఇక టీఆర్ఎస్ లో కొనసాగితే తనకు భవిష్యత్ ఉండదని ప్రదీప్ రావు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.అంతేకాకుండా ఈనెల 7న ఢిల్లీలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.
దీంతో ఫలితంగా వరంగల్ టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం బీజేపీలో చేరుతుండడం విశేషం.
గుర్తింపు ఇవ్వకుండా అవమానించారని…
తెలంగాణ ఉద్యమంలో పార్టీ నాయకులతో కలిసి పోరాడమని.ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరితే కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా అవమానించారని ప్రదీప్ రావు తన సన్నిహితుల వద్ద వాపోయారట.
తాను ఏర్పాటు చేసిన తెలంగాణ నవ నిర్మాణ సమితి పార్టీని కూడా టీఆర్ఎస్ లో విలీనం చేశానన్నారు.అయినా కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేస్తున్నారట.
వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇప్పిస్తానని చెప్పి రెండు సార్లు ఇవ్వకుండా అవమానించారని గుర్తుచేసుకున్నారట.రాజకీయంగా కష్టపడి పనిచేసినా అవకాశం ఇవ్వలేదని బాధపడ్డారట.
అయితే ప్రదీప్ రావు రాజీనామా అంశం తెరపైకి రావడంతో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు.ఆయనను బుజ్జగించేందుకు బస్వరాజు సారయ్య చర్చలు జరిపారు.
ఆయనతో పాటు రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ లు కలిసి ప్రదీప్ రావు ఇంటికి వెళ్లినా ఆయన వినలేదని సమాచారం.అవసరమైతే కేసీఆర్ తో మాట్లాడిస్తామని చెప్పారట.
అయినా కూడా ప్రదీప్ రావు వెనక్కి తగ్గేలా లేరని సమాచారం.

అంతేకాకుండా ప్రదీప్ రావు వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.ఇక టీఆర్ఎస్ నుంచి టికెట్ కష్టమేనని తెలిసి ఈ నిర్ణయానికి వచ్చారట.ఇక అటు కాంగ్రెస్ తరుఫున కొండా సురేఖ లేదా వేం నరేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.
దీంతో బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నారని టాక్.ఇక రేపో మాపో కీలక ప్రకటన చేయనున్నట్లు తన సన్నిహితుల సమావేశంలో పేర్కొనట్లు సమాచారం.