భారతీయులకు ఎంతో ప్రియమైన పండుగ దీపావళి రాబోతోంది.దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు, బాణాసంచా.
చిన్నపిల్లనుండి పెద్దవాళ్ళ వరకు ఈ పండగని చాలా ఎంజాయ్ చేస్తారు.జనాల క్యూరియాసిటీని క్యాష్ చేసుకొనేందుకు వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశం వున్న పండగ.
అందుకే ఈ పండగకు ఓ రెండు మూడు వరాల ముందే లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, పెద్ద క్రాకర్స్ తదితర బాణాసంచా అనేవి మార్కెట్లోకి వచ్చేస్తాయి.అయితే గత కొన్ని దశాబ్దాలుగా టపాసులను కాల్చడం వల్ల వాతావరణంలో వాయుకాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోవడం మనకు తెలిసినదే.
ఈ నేపథ్యంలో కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఎకో ఫ్రెండ్లీ ఫైర్‌క్రాకర్స్ వైపు మళ్లుతున్నారు.అలాగే మరికొంతమంది ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ కొనుగోలు చేస్తూ పర్యావరణానికి మంచి చేకూరుస్తున్నారు.అందుకే మీరు కూడా ఈ దీపావళిని పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోండి.అయితే ఈ ఎలక్ట్రానిక్ క్రాకర్స్ ఎక్కడ దొరుకుతాయి అనే సందేహం మీకు కలగ వచ్చు.
ఇపుడు అమెజాన్ స్పెషల్ సేల్‌లో వీటిపై మంచి డిస్కౌంట్లు అందిస్తుంది.అవును, దీపావళి సేల్స్‌లో ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌కి మంచి స్పందన రావడంతో ఆన్లైన్ మార్కెట్లోకి కూడా వచ్చేశాయ్.
ఇకపోతే ఈ ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ అనేవి అసలైన బాంబుల్లానే లైటింగ్ ప్రొడ్యూస్ చేస్తాయి.నిజమైన ఫైర్‌క్రాకర్స్ మాదిరిగానే సౌండ్ చేస్తూ పేలుతాయి.నిజమైన బాణసంచాతో పోలిస్తే వీటి సౌండ్, కాంతి తీవ్రత కాస్త తక్కువగానే ఉంటుంది.ఇంకా వీటితో ఎలాంటి ప్రమాదాలు జరగవు.వీటివల్ల ఉత్పన్నమయ్యే ఎయిర్, సౌండ్ పొల్యూషన్ దాదాపు శూన్యం అని చెప్పొచ్చు.అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.