దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన హిజాబ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చడం లేదు.విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ క్రమంలో నమోదైన పిటిషన్ లను విచారించిన సుప్రీం ధర్మాసనం.హిజాబ్ నిషేధం ఎత్తివేతపై భిన్న తీర్పులు వెలువరించింది.
కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ నిషేధాన్ని జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు.మరోవైపు కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ ధులియా తోసిపుచ్చుతూ నిషేధం సరికాదంటూ తీర్పునిచ్చారు.
రెండు విభిన్న తీర్పులు రావడంతో హిజాబ్ వివాదం కొలిక్కి రాలేదు.