టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లండ్..

టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లండ్ నిలిచింది.వరల్డ్ కప్ 2022 టోర్నీని కైవసం చేసుకుంది.

 England Is The Winner Of The T20 World Cup.-TeluguStop.com

ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.పాక్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.2010 తర్వాత రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది ఇంగ్లండ్.మూడోసారి ఫైనల్ కి చేరిక పాకిస్థాన్ మరోసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది.

ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్ లో ఓటమికి గురైన పాక్.వరల్డ్ కప్ లో ఫైనల్స్ వరకు వచ్చినా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.

ఈ ఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆదేశించింది.తమ కెప్టెన్ నిర్ణయం సరైనదని రుజువు చేసిన ఇంగ్లండ్ బౌలర్లు పాకిస్థాన్‌ను 137/8 స్కోరుకు పరిమితం చేశారు.

ఇంగ్లండ్‌లో శామ్ కరెన్ 3, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ 2-2 వికెట్లు తీశారు.ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్ అత్యధిక పరుగులు చేశాడు.

జోస్ బట్లర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.ఈ విజయంతో కేవలం 3 ఏళ్ల వ్యవధిలో 2 ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది.

138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది.అలెక్స్ హేల్స్ ఒక పరుగు చేయగా.ఫిలిప్ సాల్ట్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేశాడు.17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన జోస్ బట్లర్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.దీంతో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.బెన్ స్టోక్స్, హారీ బ్రూక్ కలిసి నాలుగో వికెట్‌కి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.23 బంతుల్లో ఓ ఫోర్‌తో 20 పరుగులు చేసిన హారీ బ్రూక్ ఆ తర్వాత అవుట్ అయ్యాడు.10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 5 పరుగులు రాగా, 14వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చాడు నసీం షా…దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube