ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో సిపిఎం నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు.పాలేరు ఎర్రజెండా ఎగరబోతుంది.
మోడీని తట్టుకోవాలంటే కేసీఆర్ పార్టీతో కలిసి పనిచేయాలి.ఏడాదిలో అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి.
కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అన్ని స్థానాల్లో సీపీఎం, సీపీఐ, టిఆర్ఎస్ పార్టీలే గెలవాలి.
ఇప్పటికే మనతోపాటు సీపీఐ పార్టీ కూడా ఓ ఓప్పొందానికి వచ్చింది.
పాలేరు ఎర్రజెండా ఎగరాలంటే ఆషామాషీ కాదు ప్రతిఒక్కరు శ్రమించాలి.అసలే డబ్బు రాజకీయలొచ్చాయి.
జాగ్రత్తగా గ్రామాల్లో టిఆర్ఎస్, సీపీఐ నేతల్ని ఇప్పటినుంచే కలుపుకొని పోవాలి.అప్పుడే పాలేరులో ఎర్రజెండా ఎగరేస్తాం.
ఆదిశగా మీరు అడుగులు వేయండి పార్టీ శ్రేణులకు తమ్మినేని వీరభద్రం సూచన.