ఏలూరు జిల్లా ముప్పవరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.దారాల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఎగసిపడుతున్నాయి.
తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు పది గంటలుగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంటల్లో పరిశ్రమలోని మిషనరీ, ముడి సరుకు కాలి బూడిదైంది.దాదాపు 20 మంది ఫైర్ సెఫ్టీ సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా ఈ ప్రమాదంలో సుమారు రూ.8 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.అయితే ప్రమాదం జరగడంపై పరిశ్రమ యాజమాన్యం అనుమానాలు వ్యక్తం చేస్తుంది.