పెళ్లి పీఠలు ఎక్కాల్సిన కొత్త జంట సెల్ఫీ తీసుకున్నందుకు దారుణం... పాక్‌లో పరిస్థితికి ఇదే నిదర్శణం  

ముస్లీంల ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకప్పుడు ఆడవారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయేది. కాని ప్రస్తుతం మెల్లమెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. ఇండియాలో ఇతరులతో సమానంగా ముస్లీంలు బయట తిరుగుతున్నారు. ముఖ్యంగా ఇండియాలోని ముస్లీం ఆడవారికి పూర్తి స్వేచ్చ ఉంది. కాని ముస్లీం పాలిత దేశాల్లో మాత్రం మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బయటకు వెళ్లడం, వాహనాలు డ్రైవ్‌ చేయడం, ఫోన్‌లు వాడటం ఇలా అన్ని కూడా నిషేదమే. తాజాగా పాకిస్తాన్‌లో జరిగిన ఒక సంఘటన అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.

Engaged Couple Killed For Taking Selfie Together In Karachi-Marina And Salman

Engaged Couple Killed For Taking Selfie Together In Karachi

పాకిస్తాన్‌కు చెందిన ఒక జంట పెళ్లికి సిద్దం అయ్యారు. పెద్దలు కుదిర్చిన వివాహం అది. ఇరు కుటుంబ సభ్యులు ముస్లీం పద్దతిలో ఎంగేజ్‌మెంట్‌ను నిర్వహించారు. ఆ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల అతిధులు మరియు సన్నిహితులు వచ్చారు. పెళ్లికి డేట్‌ ఫిక్స్‌ చేశారు. కొన్ని రోజుల్లో పెళ్లి కాబోతుంది అంటూ తెలియడంతో ఆ కొత్త ఆనందంలో మనిగి పోయారు. ఏదో ఒక సందర్బంలో ఇద్దరు కలవడం జరిగింది. ఆ సమయంలో వారు ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీని బందువులతో షేర్‌ చేసుకున్నారు.

Engaged Couple Killed For Taking Selfie Together In Karachi-Marina And Salman

పెళ్లికాకుండానే అమ్మాయి, అబ్బాకి కలవడం ఎక్కువ అంటే, సెల్ఫీ కూడా తీసుకోవడం ఏంటీ అంటూ ముస్లీం పెద్దలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి కుటుంబ పెద్దలను పిలిచి క్షమాపణ చెప్పించారు. బందువులు మరియు ఊరందరి ముందు క్షమాపణలు చెప్పించడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తమ పరువు తీశారు అంటూ అబ్బాయిని తండ్రి చంపేయగా, అమ్మాయిని స్వయంగా తండ్రి విషం ఇచ్చి చంపేశారు. విషయం తొసుకున్న పోలీసులు విచారణ జరుపగా ఈ విషయం వెళ్లడయ్యింది. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన వారిని కాటికి పంపిన ముస్లీం మత పెద్దలను కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.