ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి .దీనికి తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ( YSRCP )లో హడావుడి పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేస్తున్నారు.దీంతో పాటు ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) కు చెందిన ఐ ప్యాక్ టీం అలాగే , ఇంటిలిజెన్స్ సిబ్బంది ప్రజలనాడి పసిగట్టే పనిలోనే నిమగ్నం అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి ! సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏమిటి ? ఇలా అనేక అంశాలపై సర్వేలు జరుగుతున్నాయి.వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అంత భావిస్తుండగా, వైసిపి మాత్రం ఇప్పుడే ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్లుగా హడావుడి చేస్తోంది.
ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్ అనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలతో జనాల్లో ఉంటూ జన బలం పెంచుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఇక ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ స్థాయిలోనూ హడావుడి జరుగుతుండడంతో, ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ జనసేనలు ముందుగానే అంచనా వేశాయి.అనేక సందర్భాల్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే హడావుడి చేశాయి.
అయితే ఈ విషయాన్ని అధికార పార్టీ వైసిపి ఖండించింది. సాధారణ ఎన్నికల జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది.
అప్పట్లో ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ప్రకటించారు.తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైసిపి సిద్ధంగానే ఉందని సజ్జల ప్రకటించారు.దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందా ? అందుకే ఈ విధంగా వ్యాఖ్యానించారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

నిన్న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చిల్లకల్లు రోడ్డు ప్రారంభంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ఎన్నికల అంశంపై స్పందించారు.సీఎంగా జగన్( cm Jagan ) ఏపీకి చేసిన అభివృద్ధితో పోలిస్తే ఏ రాష్ట్రంలోనూ కనీసం 10% కూడా చేయలేదని , టిడిపి అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తమ పార్టీని హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ ప్రజలంతా మళ్ళీ వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.ఇది ఇలా ఉంటే మరో నాలుగు నెలల్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఏపీలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.దీనికి తగ్గట్లుగానే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనికి తగ్గట్టుగానే ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికల వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.