కొడుకు పాన్ ఇండియా స్టార్ అయినా ఇప్పటికీ డ్రైవర్ గా పని చేస్తున్న తండ్రి..ఎవరంటే..?

చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరోలు మొదట్లో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు.ఎన్నో అవమానాలు, నిద్రలేని రాత్రులు, తిండి లేక పస్తులున్న రోజులు అనేకం ఉంటాయి.

 Kgf 2 Star Yash Father Still Works As Bus Driver Details, Kgf 2 , Yash , Yash Fa-TeluguStop.com

అయితే ఒకసారి స్టార్డం వచ్చాక కొంత మంది ఆ స్టార్డం ని మరింత రెట్టింపు చేసుకుంటే ఇంకొంతమంది వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.అయితే కొంతమంది మాత్రం సినిమాల్లోకి రాకముందు చిన్నచిన్న క్యారెక్టర్లలో అలాగే సీరియల్స్ లో చేస్తూ ఒక్కసారిగా స్టార్ అవుతారు.

అలాంటి వారిలో కేజిఎఫ్ (KGF) సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ (Yash) కూడా ఒకరు.అయితే యష్ సినిమాల్లోకి వచ్చాక యష్ గా పేరు మార్చుకున్నారు.

కానీ ఆయన ఇండస్ట్రీ లోకి రాకముందు నవీన్ కుమార్ గౌడ్ (Naveen kumar goud) అనేది ఆయన అసలు పేరు.ఇక యష్ తండ్రి పేరు అరుణ్ కుమార్.

ఈయన కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటారు.అయితే అందరూ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే.

Telugu Arun Kumar, Bus, Yash, Kgf, Karnataka Bus, Yash Arun Kumar-Latest News -

కొడుకు కే జి ఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి పాన్ ఇండియా హీరోగా మొదటి సినిమాతోనే అదరగొట్టి ఆ తర్వాత వచ్చిన కేజిఎఫ్ -2 (KGF-2) తో కూడా సంచలనం సృష్టించింది అని చెప్పుకోవచ్చు.అయితే రెండు సినిమాలతో ప్రపంచం మెచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్న యష్ తండ్రి అరుణ్ కుమార్( Arun Kumar ) మాత్రం తన కొడుకు పాన్ ఇండియా హీరో అయితే ఏంటి.

Telugu Arun Kumar, Bus, Yash, Kgf, Karnataka Bus, Yash Arun Kumar-Latest News -

తన పని తనది అన్నట్లుగా ఇప్పటికీ ఆర్టీసీ బస్ డ్రైవర్ (RTC Bus driver) గానే చేస్తూ ఉండడం గమనార్హం.అంతేకాదు తిండి పెట్టిన తన ఉద్యోగాన్ని వదులుకోలేక కొడుకు స్టార్ అయ్యారు కదా నాకేంటి ఈ బస్సు నడపవలసిన అవసరం అని ఆలోచించకుండా ఇప్పటికి కూడా బస్సు డ్రైవర్ గానే చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇక ఈ విషయం తెలిసే చాలామంది యష్ తండ్రి అరుణ్ కుమార్ (Arun kumar) కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube