హైదరాబాద్లో డ్రగ్స్ మరోసారి కలకలం సృష్టించాయి.నూతన సంవత్సర వేడుకలే టార్గెట్ గా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ టీమ్స్ గుర్తించాయి.
విజయవాడలో ప్రధాన నిందితుడు హరిసతీశ్ ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలో బంజారాహిల్స్ లోని ఓ హాస్టల్ పై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్ టీమ్స్ 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.కొకైన్ గ్రాము రూ.5 వేలు, ఎండీఎంఏ గ్రాము రూ.10 వేలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు.ఇటీవల పట్టుబడ్డ నిందితుడు యమనే నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు.ఈ క్రమంలో పదకొండు మంది పాత డ్రగ్స్ వినియోగదారులు ఏజెంట్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.