ఆస్పత్రిలో చేరిన డ్రగ్స్ కేసు హీరోయిన్ సంజన.. ఏం జరిగిందంటే?

కన్నడ సినీ పరిశ్రమలు గతంలో డ్రగ్స్ మాఫియా కలకలం రేపిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే శాండిల్ వుడ్ హీరోయిన్స్ సంజనా,రాగిణి పై గతంలో కేసు నమోదు అయిన సంగతి మనకు తెలిసిందే.

 Drug Case Actress Sanjjanaa Galrani Got Hospitalised, Actress Sanjjanaa Galrani,-TeluguStop.com

అయితే వీళ్లు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంపై ఈ హీరోయిన్స్ నుంచి బ్లడ్, యూరిన్ నమూనాలను సేకరించి పరీక్షలు జరుపగా సరైన పరీక్ష ఫలితాలు వెలువడన నేపథ్యంలో, వీరి వెంట్రుకలను పరీక్షలకు పంపించగా అందులో వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ విధంగా ఫలితాలు వెలువడటంతో పోలీసులు వీరికి సమన్లు జారీ చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే నిందితులలో ఒకరైన నటి సంజనా గల్రాని అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తన తల్లి రేష్మా గల్రాని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంజనా అనారోగ్యం కారణంగానే ఆసుపత్రిలో చేరిందని మేము ఎలాంటి తప్పు చేయలేదని, ఇంకా కష్ట సమయాలలో ఎంతో మంది పేదలకు అన్నదానం చేస్తూ మంచి పనులు చేశామని సంజనా తల్లి తెలియజేశారు.

Telugu Drug-Movie

ఈ క్రమంలోనే మరో నటి రాగిణి ఈ విషయంపై స్పందిస్తూ.దేవుడు తలచిన దానిపై మనకు నమ్మకం ఉండాలి.మనం అనుకున్నది జరగకపోతే కోపం ప్రదర్శించకూడదు ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అవుతుందని నటి రాగిణి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఇంటికే పరిమితమైన ఈ నటి మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.

అయితే ఈ కేసును ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయం గురించి లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube