ట్రంప్ ది కుట్రే...పక్కా ఆధారాలు ఉన్నాయి...తేల్చేసిన హౌస్ కమిటీ...

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి తెలియని వాళ్ళు ఉంటారా కేవలం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి ట్రంప్ పేరు చెప్పగానే అలాంటి తిక్కల అధ్యక్షుడు మరొకరు లేరు అంటారు.తన ప్రవర్తనతో అలాంటి ఎన్నో ఘన కీర్తులు సంపాదించారు ట్రంప్.

 Donald Trump ‘engaged In A Criminal Conspiracy’ To Block Biden’s Victory,-TeluguStop.com

అధ్యక్షుడిగా పూర్తిగా వైఫల్యం చెందిన తరువాత ఆయన చేసిన, నడిపించిన నాటకీయ రాజకీయ పరిణామాలు ట్రంప్ ప్రతిష్టకు పూర్తిగా విఘాతం కలిగించాయి.ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిన తరువాత తన మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, ఆయన రెచ్చ గొట్టే విధానం అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాపిటల్ భవనం పై దాడికి ప్రేరేపించాయి.

క్యాపిటల్ భవనం పై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది.పోలీసులు, ఆందోళన కారులు కూడా ఈ ఘటనలో మృతి చెందారు.దాంతో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బిడెన్ ఈ ఘటనపై మండిపడ్డారు.క్యాపిటల్ భవనం పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఓ హౌస్ కమిటీని వేశారు.ఇప్పటికే

ఈ ఘటనపై కొందరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అయితే తాజాగా బిడెన్ వేసిన హౌస్ కమిటి ఓ కీలక ప్రకటన చేసింది.క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఆయన అనుచరులు ఈ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.అధ్యక్ష ఎన్నికల ఫలితాలని కాంగ్రెస్ ఆమోదం తెలిపేందుకు జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ట్రంప్ తప్పుడు సమాచారం తన అనుచరులకు అందించారని అదే క్యాపిటల్ పై దాడి జరిగేలా చేసిందని హౌస్ కమిటి కాలిఫోర్నియా కోర్టుకు తన నివేదిక అందించింది.

అయితే ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.

Donald Trump ‘engaged In A Criminal Conspiracy’ To Block Biden’s Victory

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube