ట్రంప్ ది కుట్రే...పక్కా ఆధారాలు ఉన్నాయి...తేల్చేసిన హౌస్ కమిటీ...

ట్రంప్ ది కుట్రే…పక్కా ఆధారాలు ఉన్నాయి…తేల్చేసిన హౌస్ కమిటీ…

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి తెలియని వాళ్ళు ఉంటారా కేవలం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి ట్రంప్ పేరు చెప్పగానే అలాంటి తిక్కల అధ్యక్షుడు మరొకరు లేరు అంటారు.

ట్రంప్ ది కుట్రే…పక్కా ఆధారాలు ఉన్నాయి…తేల్చేసిన హౌస్ కమిటీ…

తన ప్రవర్తనతో అలాంటి ఎన్నో ఘన కీర్తులు సంపాదించారు ట్రంప్.అధ్యక్షుడిగా పూర్తిగా వైఫల్యం చెందిన తరువాత ఆయన చేసిన, నడిపించిన నాటకీయ రాజకీయ పరిణామాలు ట్రంప్ ప్రతిష్టకు పూర్తిగా విఘాతం కలిగించాయి.

ట్రంప్ ది కుట్రే…పక్కా ఆధారాలు ఉన్నాయి…తేల్చేసిన హౌస్ కమిటీ…

ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిన తరువాత తన మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, ఆయన రెచ్చ గొట్టే విధానం అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాపిటల్ భవనం పై దాడికి ప్రేరేపించాయి.

క్యాపిటల్ భవనం పై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది.

పోలీసులు, ఆందోళన కారులు కూడా ఈ ఘటనలో మృతి చెందారు.దాంతో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బిడెన్ ఈ ఘటనపై మండిపడ్డారు.

క్యాపిటల్ భవనం పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఓ హౌస్ కమిటీని వేశారు.

ఇప్పటికే """/"/ ఈ ఘటనపై కొందరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అయితే తాజాగా బిడెన్ వేసిన హౌస్ కమిటి ఓ కీలక ప్రకటన చేసింది.

క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఆయన అనుచరులు ఈ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.

అధ్యక్ష ఎన్నికల ఫలితాలని కాంగ్రెస్ ఆమోదం తెలిపేందుకు జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ట్రంప్ తప్పుడు సమాచారం తన అనుచరులకు అందించారని అదే క్యాపిటల్ పై దాడి జరిగేలా చేసిందని హౌస్ కమిటి కాలిఫోర్నియా కోర్టుకు తన నివేదిక అందించింది.

అయితే ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.

వెంకీ అట్లూరి సినిమాలో సూర్య అల కనిపించబోతున్నాడా..?