అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగం అంటే లగ్జరీ లైఫ్, ఫాస్టెస్ట్ కల్చర్, డబ్బుకు డబ్బు, హోదాకు హోదా వారి జీవితమే మరో స్వర్గం అనేది అందరి భావన, అందుకే ఎంతో మంది అమెరికాలో చదువుకో, ఉద్యోగానికో ప్రాధాన్యత ఇస్తుంటారు.అయితే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మన సంపాదన బట్టే అక్కడ మన జీవన శైలి ఆధారపడి ఉంటుంది.
పైగా కరోనా తరువాత అక్కడ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి.అత్యధిక జీతం పొందుతున్న వారిపై ఎలాంటి ప్రభావం లేకపోయినా అల్పాదాయం పొందే వారిపై మాత్రం అమెరికాలో చుక్కలు కనిపిస్తున్నాయట.
అమెరికాలో ద్రవ్యోల్బణం మే నెలలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో గడిచిన 40 ఏళ్ళలో 8.6 శాతానికి చేరుకుందట.దాంతో మండు వేసవిని మించిన సెగలు స్మాన్యులలో వేడి పుట్టిస్తున్నాయి.గడిచిన ఏప్రియల్ నేలతో పోల్చితే సుమారు 0.5 శాతం ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదయ్యిందట.దాంతో అల్పాదాయం కలిగిన వారు ఏం చేయాలో తెలియక పొదుపు మార్గాలవైపు దృష్టి సారిస్తున్నారు.
చివరికి వారి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే హెయిర్ కట్ చేసుకోవడం కంటే ఒత్తుగా జుట్టు పెంచుకుంటే తప్పేముంది అనుకుని సెలూన్స్ కి కూడా వెళ్ళడం లేదట.అంతేకాదు.
ఇళ్ళలో ఎలెక్ట్రానిక్, ఇతరాత్రా సామాన్లు కొనుగోలుపై ఇప్పట్లో ఎలాంటి ఆలోచనలు లేవని చెప్తున్నారట.ఇక ద్రవ్యోల్బణం కారణంగా పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.4 లీటర్ల పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.400 గా 50వేల డాలర్ల లోపు ఆదాయం ఉన్న వారు ఆఫీసులకు ట్రైన్, బస్సు మార్గాలను ఎంచుకుంటున్నారట.అమెరికాలో గతంలో పరిస్థితులు వచ్చేంత వరకూ ఎలాంటి కొనుగోళ్ళు చేపట్టే సమస్య లేదని తేల్చి చెప్తున్నారని స్థానిక సర్వేలు చెబుతున్నాయి.ఇదిలాఉంటే విహారయాత్రలకు మాత్రం తక్కువ ఆదాయం ఉన్న వారైనా సరే రాజీ పడటం లేదని కనీసం వినోదం కూడా లేకపోతే మరీ మరమనుషులుగా మారిపోతామని అందుకే ఈ విషయంలో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదని అంటున్నారట.