ప్రేమ కావాలి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కాల పరిమితి చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి ఇండస్ట్రీలోకి కొత్తవారు వస్తుంటే పాతవారు వెళ్లిపోవడం సర్వసాధారణం.అయితే కొంతమంది హీరోయిన్లు తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఉంటారు.

 Do You Know How The Heroine Of The Movie Premakaval ,premakavali, Actress Isha-TeluguStop.com

మరికొందరు మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి కనుమరుగైపోతుంటారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో ప్రేమ కావాలి( Premakavali ) హీరోయిన్ ఇషా చావ్లా (Isha chawla ) ఒకరు.

హీరో సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ ( Aadi Saikumar ) నటించిన ప్రేమ కావాలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ఇషా చావ్లా.

Telugu Aadi Kumar, Actressisha, Premakavali, Sunil, Tollywood-Movie

ఇలా ప్రేమ కావాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.ఈ విధంగా ప్రేమ కావాలి సినిమా సక్సెస్ తర్వాత ఈమె సునీల్ ( Sunil ) హీరోగా నటించిన పూలరంగడు ( Pularangadu ) సినిమాలో నటించారు.

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.అయితే ఈమె నటించిన తదుపరి సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

Telugu Aadi Kumar, Actressisha, Premakavali, Sunil, Tollywood-Movie

ఇలా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.అక్కడ కూడా చేదు అనుభవం ఎదురవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేయగా, అది కూడా ఆగిపోయింది.ఇలా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన ఇషా చావ్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు.

Telugu Aadi Kumar, Actressisha, Premakavali, Sunil, Tollywood-Movie

అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఈమె సోషల్ మీడియాలో ఆఖరి పోస్ట్ చేశారు.ఇక ఈ ఏడాది ఈమె ఏ విధమైనటువంటి పోస్టులు చేయకపోవడంతో ఇషా చావ్లా పూర్తిగా ఇండస్ట్రీకి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండిపోయారని తెలుస్తుంది.మరి ఈమెకు ఏదైనా అవకాశాలు వస్తే తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube