బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రతిక( Rathika ) ఒకరు.బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో ఈమె ఉన్నది కేవలం నలుగు వారాలే అయినప్పటికీ విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేస్తుంది హౌస్ లోకి వెళ్లినటువంటి మొదటి వారం ఎంతో అద్భుతంగా ఆట తీరుతో అందరిని ఆశ్చర్యపరిచినటువంటి ఈమె అనంతరం ఆటను పూర్తిగా పక్కన పెట్టి ఫేక్ బాండింగ్ ఏర్పరచుకోవడం పట్ల దృష్టి పెట్టారు.
ఇలా ఈమె ఆట తీరు మొత్తం మారిపోవడంతో ఈమె ప్రవర్తన వల్ల విసుగు చెందే ఈమెను నాలుగవ వారమే హౌస్ నుంచి బయటకు పంపించేశారు.
ఇలా టాప్ ఫైవ్ వరకు కొనసాగుతుంది అనుకున్నటువంటి ఈమె నాలుగవ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.రతిక తిరిగి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.ఈ వీకెండ్ లో రతిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇకపోతే ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందే పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించి సందడి చేశారు.
ఈ సినిమాలో ఈమె మినిస్టర్ పాత్రలో కనిపించారు. రతిక పాత్ర నిడివి ఉన్నది తక్కువే అయినప్పటికీ ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యతనే లభించిందని చెప్పాలి తెరపై ఈమె కనిపించినప్పుడు పెద్ద ఎత్తున థియేటర్లో చేసిన గోల మామూలుగా లేదు.ఇలా ఈ సినిమాలో కేవలం ఐదు నిమిషాల పాటు మాత్రమే నటించిన ఈమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది.మరి ఈ సినిమాలో మినిస్టర్ పాత్రలో నటించినందుకు గాను ఈమె ఎంతో మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న విషయం గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది.
రతీక పాత్ర నిడివి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అయినప్పటికీ ఈమె ఏకంగా 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.ఇలా ఐదు నిమిషాలకు ఐదు లక్షల రెమ్యూనరేషన్( Remuneration ) అంటే భారీ రెమ్యూనరేషన్ అని చెప్పాలి.