కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నటించిన తాజా చిత్రం జవాన్ ( Jawan ) ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా దాదాపు 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం అందుకోవడంతో ముంబైలో ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా చిత్ర బృందం పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అట్లీ(Atlee ) మాట్లాడుతూ జవాన్ సినిమాకు అయినటువంటి బడ్జెట్( Budget ) గురించి ఓపెన్ అయ్యారు.
ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ కరోనా కన్నా ముందుగానే ఈ సినిమా కథ షారుఖ్ ఖాన్ గారికి వినిపించాను.అయితే అప్పుడే లాక్ డౌన్ పడింది.దీంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి ఇక ఈ సినిమా ఎవరైనా చేస్తారా… ఇప్పుడు నాకు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నన్ను నమ్మి ఎవరైనా 40 కోట్ల రూపాయలతో సినిమా చేయడానికి ముందుకు వస్తారా అని నేను ఆలోచించేవాడిని అయితే ఈ సినిమా కథనం షారుక్ ఖాన్ గారికి వినిపించాను సినిమా కథ విన్నటువంటి ఆయన తన సొంత బ్యానర్ లోనే సినిమా చేస్తానని తెలిపారు.
అంతేకాకుండా ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అట్లీ తెలిపారు.
ఇలా 300 కోట్ల రూపాయల బడ్జెట్ చెప్పడంతో తనకు ఎంతో సంతోషం వేసింది అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణం వల్ల కాస్త ఆలస్యం అవుతూ రావడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది అంటూ ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు అయితే బాలీవుడ్( Bollywood ) సమాచారం ప్రకారం ఈ సినిమాకు సుమారు 350 కోట్ల వరకు బడ్జెట్ అయిందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఏకంగా ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఇప్పటికీ థియేటర్లలో జవాన్ సినిమా ప్రేక్షకులను సందడి చేస్తుందని ఈ వారం పూర్తి అయ్యేలోగా మరింత బడ్జెట్ రాబట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.