జబర్దస్త్ కమెడియన్ వేణు( Venu ) దర్శకత్వంలో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి సినిమా బలగం( Balagam ) .ఈ సినిమా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విజయాన్ని అందుకుంది.
తెలంగాణలోని ప్రతి పల్లెలో పరదాలు కట్టి మరి ఈ సినిమాని చూశారు అంటే ఈ సినిమాకు ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారో స్పష్టంగా అర్థం అవుతుంది.ఇలా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి బలగం సినిమా ఆస్కార్( Oscar ) ఎంట్రీ కి సెలెక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే.
దిల్ రాజ్( Dil Raju ) కుమార్తె హన్షిత రెడ్డి (Hanshitha Reddy) నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు పంపించాలన్న ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు ఇప్పటికే కార్తికేయ( Karthikeya ) ను అడిగి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నింటినీ తెలుసుకున్నారట.ఇక వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా బలగం సినిమాకు కూడా ఆస్కార్ రావాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఇండియా నుంచి 22 సినిమాలు ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో బలగం సినిమా కూడా ఉండటం విశేషం.ఇక ఈ సినిమా ఇండియా నుంచి అధికారికంగా వెళ్లకపోయినా ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie ) మాదిరి డబ్బును ఖర్చు చేసుకొని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ కి నామినేట్ అయింది.
మరి ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలోనే రాజమౌళి( Rajamouli ) కూడా ప్రైవేట్ గా ఆస్కార్ నామినేషన్ కి వెళ్తారా.ఆ సినిమా తరహాలోనే అమెరికా వెళ్లి అక్కడ భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది.అయితే కొందరు విశ్లేషకులు అభిప్రాయం మేరకు దిల్ రాజు వంటి ఒక గొప్ప నిర్మాత ఈ సినిమాని ఆస్కార్ వరకు తీసుకువెళ్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.
మరి ఆస్కార్ అవార్డును అందుకోవాలంటే భారీగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది అందుకుగాను విపరీతమైనటువంటి ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది అంత ఖర్చును దిల్ రాజు భరిస్తారా అన్న విషయం కూడా అందరిలో సందేహం కలిగిస్తుంది.