అంతటి చిరంజీవుడే గోక్కోవడం ఇష్టం లేక ఏదో మమ అనిపించి స్టేజి దిగేసాడు !

హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్( Hanuman Movie Pre Release ) కి చిరంజీవి స్టేట్స్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.హనుమాన్ సినిమా థియేటర్స్ గోల కూడా ప్రస్తుతం పెద్ద హార్ట్ టాపిక్ గా టాలీవుడ్ సినిమా సర్కిల్లో వినిపిస్తుంది.

 Dil Raju Fight With Hanuman Movie Team,,chiranjeevi,hanuman,dil Raju, Teja Sajja-TeluguStop.com

అయితే సరిగ్గా ఇలాంటి పండగ టైంలోనే దిల్ రాజు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు.ముఖ్యంగా సంక్రాంతి టైంలో దిల్ రాజు( Dil Raju ) గోల లేకుండా ఆయన థియేటర్స్ ఇష్యూ ముందుకు రాకుండా ఎవరికీ నిద్ర పట్టదు.

ఎందుకంటే దిల్ రాజు నైజం ఆంధ్రాలో ఎక్కువ థియేటర్లు హోల్డ్ చేసిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి.థియేటర్స్ ని ఎవరికి, ఏ సినిమాకు ఎంత ఇవ్వాలి అనేది శాసించే వారిలో మొట్టమొదటిగా దిల్ రాజు ఉన్నాడు.

అయితే ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమాకి తక్కువగా థియేటర్స్ కేటాయించారు అనేది అందరూ చెబుతున్న మాట.

Telugu Chiranjeevi, Dil Raju, Hanuman, Khaidi, Teja Sajja-Movie

మరి అంతటి చిరంజీవి సైతం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సినిమా చూడండి అని చెబుతున్నాడు కానీ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అంత చిక్కని ప్రశ్న.అయితే చిరంజీవి( Chiranjeevi )కి ఇలాంటి సందర్భాలు కొత్తేమీ కాదు.పైగా దిల్ రాజును ఏమీ అనలేదు చిరంజీవి మెగాస్టార్ కానీ దిల్ రాజు మెగా ప్రొడ్యూసర్, మెగా మెగా డిస్ట్రిబ్యూటర్, అంతకు మించిన మెగా బయ్యర్.

అంతటి దిల్ రాజుని కాదని ఇండస్ట్రీలో ఎవరు ఏమి పీకలేరు.ఇక చిరంజీవి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వచ్చాడు ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైన సందర్భంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కూడా విడుదలైంది అదే సమయంలో ఓ చిన్న సినిమా అయినా శర్వానంద్ శతమానం భవతి( Shatamanam Bhavathi ) కూడా విడుదలైంది.

ఈ సినిమాలకు ఏ థియేటర్స్ చాలలేదంటే శర్వానంద్ సినిమాలకు ఎక్కువగా థియేటర్స్ కేటాయించాల్సి వచ్చింది దిల్ రాజు సినిమా కాబట్టి.

Telugu Chiranjeevi, Dil Raju, Hanuman, Khaidi, Teja Sajja-Movie

ఆ టైంలో మీది చిన్న సినిమా కదా వాయిదా వేసుకోండి అంటే .సారీ అండి .కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా జనాలు చూస్తారు అంటూ చిరంజీవికి పంగనామాలు పెట్టాడు దిల్ రాజు.ఇప్పుడు హనుమాన్ చిన్న సినిమా అని వాయిదా వేసుకోండి అని దిల్ రాజు చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడున్న అతిపెద్ద సినిమా దిల్ రాజు చేతిలోనే ఉంది.పైగా హనుమాన్ నార్త్ లో బిజినెస్ చేసింది కాబట్టి సదరు నిర్మాత విడుదలను వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేడు.

ఇక రవితేజ తన సినిమాను ఈ గోల తో నాకేంటి సంబంధం అన్నట్టుగా ఫిబ్రవరి వాయిదా వేసుకున్నాడు.మరి చూడాలి దిల్ రాజు వల్ల చిరంజీవికి ఏవైనా ఎఫెక్ట్ ఉంటుందా? హనుమాన్ గట్టెక్కుతుందా అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube