తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..: మోదీ

కరీంనగర్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

 Development Of Telangana Is Possible Only With Bjp..: Modi-TeluguStop.com

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అన్న ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్న మోదీ త్వరలోనే బీజేపీ సర్కార్ ఏర్పాటుకానుందని చెప్పారు.

హుజురాబాద్ ప్రజలు గతంలోనే కేసీఆర్ కు ట్రైలర్ చూపించారన్నారు.తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.

పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీలేదని విమర్శించారు.ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కేటనన్న మోదీ ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube