తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..: మోదీ

కరీంనగర్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అన్న ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్న మోదీ త్వరలోనే బీజేపీ సర్కార్ ఏర్పాటుకానుందని చెప్పారు.

హుజురాబాద్ ప్రజలు గతంలోనే కేసీఆర్ కు ట్రైలర్ చూపించారన్నారు.తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.

పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీలేదని విమర్శించారు.ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కేటనన్న మోదీ ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బరి తెగించిన హిజ్రాలు.. ఏకంగా ప్రవేట్ పార్ట్స్ చూపిస్తూ..