Movie Title; దేవదాస్
Cast and Crew:నటీనటులు:నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన తదితరులు దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య నిర్మాత:అశ్విని దత్ సంగీతం: మణిశర్మ
STORY:
దాదా (శరత్ కుమార్), దేవా (నాగార్జున) క్రిమినల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.నెక్స్ట్ సీన్ లో డాక్టర్ దాసు (నాని)ని తెరపై పరిచయం చేసారు దర్శకుడు.
దాసు టాప్ రాంక్ డాక్టర్ కానీ కామన్ సెన్స్ తక్కువ.డేవిడ్ (కునాల్ కపూర్) దేవా పై ఎటాక్ చేస్తారు.
ఆ దాడి లో సీరియస్ గా గాయపడిన దేవా కి దాసు ట్రీట్మెంట్ చేస్తాడు.తర్వాత దేవా తన లవ్ స్టోరీ ని దాసు కి చెప్తాడు.
ఇంతలో దాసు ఇంటి పై దాడి జరుగుతుంది.పోలీసులు దేవా కోసం వెతకడంతో దేవా, దాసు లు విడిపోతారు.
చివరికి దేవా సమస్య నుండి బయటపడ్డాడా లేదా.? దేవా దాసు లు కలిసారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!
REVIEW:
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’.మాఫియా డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాస్ పాత్రలో నాని నటించారు.నాని సరసన రష్మిక, నాగార్జునకు జంటగా ఆకాంక్ష సింగ్ ఆడిపాడారు.‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ వంటి వైవిద్యభరిత చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఆద్యంతం సూపర్ కామెడీతో సినిమా అదిరిపోయిందని కొంత మంది అంటే.సినిమాలో కామెడీ తప్ప ఇంకేమీ లేదని, రొటీన్ స్టోరీనే అని మరికొందరు పెదవి విరిస్తున్నారు.శ్రీరామ్ ఆదిత్య నిరాశపరిచారని, కథనం అసలు ఏమీ బాగాలేదని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.
అయితే చాలా మంది మాత్రం సినిమా బాగుందనే అంటున్నారు.ఒకసారి కచ్చితంగా చూడాల్సిన సినిమా అట.నాని తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడట.ఇక కింగ్ నాగార్జున 60 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపించారట.డాన్‌గా ఆయన లుక్ అదిరిపోయిందట.
Plus points:
కామెడీనాని టైమింగ్నాగార్జున లుక్ఫస్ట్ హాఫ్
Minus points:
రొటీన్ స్టోరీసెకండ్ హాఫ్బోరింగ్ సీన్స్
Final Verdict:
మొత్తం మీద చెప్పాలంటే “దేవదాస్” అంచనాలను అందుకోలేకపోయింది…కానీ కామెడీ బాగుండడం, నాని నాగార్జున కామెడీ టైమింగ్ బాగుండడం తో యావరేజ్ అని చెప్పొచ్చు.వీకెండ్ లో సరదాగా వెళ్లి టైం పాస్ చేయొచ్చు.