బెస్ట్ ఇయర్ కాదు.. కాని చాలా నేర్చుకున్నా..!

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు.యూట్యూబర్ గా తన సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో అందరిని అలరించింది.

 Deepti Sunaina Shocking Statement In Instagram Post, Deepti Sunaina,shanmukh Jas-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 2లో కూడా దీప్తి పాల్గొన్న విషయం తెలిసిందే.ఇదిలాఉంటే మరో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ తో దీప్తి సునైనా ప్రేమాయణం అందరికి తెలిసిందే.

యూట్యూబ్ లో వీరిద్దరి జోడీ చేసే హంగామా మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతుంది.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొన్నాడు.

అయితే హౌజ్ లో సిరితో క్లోజ్ అవడం. ఆమెతో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవడం కొందరికి నచ్చలేదు.ఈ విషయంలో దీప్తి రెస్పాన్స్ ఏంటన్నది తెలుసుకోవాలని అనుకున్నారు.కాని బిగ్ బాస్ సండే అయిపోగా ఇప్పటివరకు షణ్ముఖ్ ని దీప్తి కలిసింది లేదు.

పైగా ఇన్ స్టాగ్రాం లో ఆమె ఇది బెస్ట్ ఇయర్ కాదు. కాని ఈ ఇయర్ చాలా విషయాలు నేర్చుకున్నానని కామెంట్ పెడుతూ ఫోటో షూట్ ఇచ్చింది.

దీప్తి సునైనా పెట్టింది షణ్ముఖ్ గురించే అని కొందరు అంటున్నారు .హౌజ్ లో షన్ను ప్రవర్తన దీప్తికి నచ్చలేదని. అందుకే కొన్నాళ్లు అతనికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.మరి ఈ రూమర్స్ కు చెక్ పడాలంటే మాత్రం షణ్ముఖ్ తో దీప్తి కలిసి కనిపించాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube